బాబు అండ్ కో ఇప్పుడేమంటారో చెప్పాలి

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య సాయిరెడ్డి ట్వీట్‌ 

తాడేప‌ల్లి: భారత్ లో కోవిడ్ మహమ్మారి ఎప్పటికీ ఉండిపోయే వ్యాధిగా మారుతోందని WHO వెల్లడించింది. ఒక శాస్త్రీయ అధ్యయనం ఫలితాలను ఉంటంకిస్తూ ఈ విషయాన్ని తెలిపింది. కోవిడ్ మహమ్మారితో సహజీవనం తప్పదని ఏడాది క్రితమే సిఎం వైయ‌స్ జగన్ అంటే వెకిలి వ్యాఖ్యలు చేసిన బాబు అండ్ కో ఇప్పుడేమంటారో చెప్పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు.

జాతీయ ఎస్సీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. దళితులపై ఎక్కడ నేరాలు జరిగినా ఫిర్యాదు చేసి న్యాయం పొందొచ్చు. అలాంటి అత్యున్నత కమిషన్ సభ్యులు రాష్ట్రాన్ని సందర్శించి హత్యకు గురైన రమ్య కేసులో ప్రభుత్వం వేగంగా, మానవతా దృక్పథంతో స్పందించిన తీరును ప్రశంసించారు. మాలోకానికి  వినిపిస్తోందా? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top