చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదు

 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి 
 

తాడేపల్లి : కోవిడ్ తీవ్రతను కప్పిపెడుతున్నారని చంద్రబాబునాయుడు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి చంద్రబాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెట్టి వదులుతున్నాడని మండిపడ్డారు. దాస్తే కనపడకుండా పోవడానికి మీ బినామీ ఆస్తులు, బ్లాక్ మనీ కాదని ట్విటర్‌లో పేర్కొన్నారు.
 
 ఈ యుద్ధంలో ప్రజల సహకారమే కీలకం
కోవిడ్ పరీక్షల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. వైరస్‌పై విజయం సాధించేందుకు ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో శ్రమిస్తోందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ప్రజల సహకారమే కీలకమన్నారు. మహమ్మారి అనేక విధాలుగా వ్యాపిస్తుందని, లాక్ డౌన్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ ఉనికిని తుడిచేయాలని సూచించారు.

Back to Top