కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్...?

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

తాడేపల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాను చంద్రబాబుకు అమ్ముడపోలేదని ప్రమాణం చేసేందుకు కాణికాపానికి ఎప్పుడు వస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.  కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో  రూ.30 కోట్లు నొక్కేశాడని ఎలక్షన్ల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికలు రాశాయి. స్థానికంగా సమీకరించిన విరాళాలూ దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కన్నా తో కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు పెద్దలకు తెలుసు అంటూ అప్పట్లో ఆంధ్రప్రభ పత్రిక ప్రచురించిన వార్తను జత చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Back to Top