పొత్తు తిరుగుడు పువ్వు చంద్ర‌బాబు

తాడేప‌ల్లి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు పొత్తు తిరుగుడు పువ్వులాంటి వ్య‌క్తి అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. పొద్దు ఎటు ఉంటే అటు తిరిగేది పొద్దు తిరుగుడు పువ్వు అయితే.. పొత్తుకు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే అటు తిరిగే పొత్తు తిరుగుడు పువ్వు చంద్ర‌బాబు అంటూ అభివ‌ర్ణిస్తూ విజ‌య‌సాయిరెడ్డి ఓ పోస్ట్‌ను ట్వీట్ చేశారు..

'సర్కార్ వారి పాట’ బాగుంది
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంద‌ని అంత‌కుముందు విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించార‌ని అభినందించారు. ఈ మేర‌కు All the best to MaheshBabu అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top