గాలికి కొట్టుకొచ్చింది ఎవ‌రు బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  చంద్ర‌బాబు మూడు సార్లు సీఎం అయినా ఒక్క‌సారి కూడా ఆయ‌న స్వాతంత్ర్యంగా గెల‌వ‌లేద‌ని, ప్ర‌తిసారి ఏదో ఒక గాలికి కొట్టుకొచ్చి గెలిచార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. మీరు 3 సార్లు సిఎం అయింది మాత్రం గాలివాటంగానే. ఒకసారి ఎన్టీఆర్ గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నారు. 1999, 2014లో బిజెపి ప్రభంజనంలో బయటపడ్డారు. గాలికి కొట్టుకొచ్చింది ఎవరు? 50%  ఓట్లు,151 సీట్లతో ప్రజలు వైయ‌స్ జ‌గ‌న్  గారిని ఆశీర్వదిస్తే గాలికి గెలిచినట్టా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

Back to Top