వైయ‌స్ జ‌గ‌న్ స్ఫూర్తిని అందిపుచ్చకున్న వారందరికి అభినందనలు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి: అంతుచిక్కని వ్యాధితో ఏలూరు హాస్పిటల్ కు వచ్చిన రోగులకు భరోసా కల్పించడంలో డాక్టర్లు, సిబ్బంది దేవతల్లా స్పందించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. క్షణాల్లో రోగులను తీసుకెళ్లి, చికిత్స ప్రారంభించడం కార్పోరేట్ ఆసుపత్రుల్లో కూడా కనిపించదు. సిఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి స్ఫూర్తిని అందిపుచ్చకున్న వారందరికి అభినందనలు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఘ‌ట్టం ఇది..
‘జగనన్న జీవక్రాంతి’ కింద 2.50 లక్షల జీవాలు పంపిణీ చేయడం చరిత్రలో నిల్చిపోయే ఘట్టం. దీనికోసం వ్యయం చేసే 1868 కోట్లు బలహీన వర్గాల మహిళల స్వయం సమృద్ధికి తోడ్పడతాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సిఎం  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు నిరంతరం  తాపత్రయపడుతున్నారని మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top