తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచన చేస్తారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. సేకరించిన ధాన్యానికి సంక్రాంతిలోగా చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రైతులకు ఏ బిల్లులూ పెండింగ్ ఉండవు. ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికీ నిత్యవసర సరుకుల పంపిణీ. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి గురించీ ఆలోచించే వ్యక్తి మన సీఎం వైయస్ జగన్ గారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గుడి తాళం తెరవక ముందే.. విజయవాడ బస్టాండ్ దగ్గర సీతమ్మవారి మట్టి విగ్రహం పగలిపోవడం దురదృష్టకరం. ఆ విషయం గుడి తలుపులు తీశాక లోకానికి తెలిసింది. మరి గుడి తాళం తెరవక ముందే అక్కడికి పచ్చ నేతలు, పచ్చ మీడియా ఎలా వెళ్లారబ్బా? రామతీర్థం శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసినవారే సీతమ్మవారి విగ్రహాన్నీ కూలగొట్టారా? అంటూ అంతకుముందు ట్వీట్‌లో విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.