టెర్ర‌రిస్ట్‌ ముఠాకు చంద్రబాబే నాయకుడు

వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు

పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు సమర్ధిస్తున్నారా?

వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి చంద్రబాబు ఢిల్లీ వచ్చారా?

చంద్రబాబు ఆంధ్రరాష్ట్ర పరువును దిగజారుస్తున్నారు

చంద్రబాబు హయాంలోనే గంజాయి అమ్మకాలు 

గంజాయి వ్యాపారంలో లోకేష్‌ పాత్ర ఉందని ప్రజలందరికీ తెలుసు

చంద్రబాబుకు భయపడి పట్టాభి మాల్దీవ్‌కు వెళ్లాడు.

న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడే  ఒక టెర్ర‌రిస్ట్‌  .. టెర్ర‌రిస్ట్‌ ముఠాకు ఆయనే నాయకుడని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరువును చంద్రబాబు దిగజారుస్తున్నారని మండిపడ్డారు. పట్టాభి సీఎం వైయస్‌ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సమర్ధించుకునేందుకు ఢిల్లీకి వచ్చారా? వ్యవస్థలను మేనేజ్‌ చేసేందుకు వచ్చారా? ఏం ప్రయోజనాల కోసం చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని నిలదీశారు. పట్టాభి ఉద్దేశపూర్వకంగానే సీఎం వైయస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయించారు. ఆ వ్యాఖ్యలపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, యూపీలో ఇలాంటి భాష వాడితే మీకు ఎలాంటి శాల్తీ జరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు అన్నారు. చంద్రబాబు రంగులు తెలుసుకున్న ఢిల్లీ నేతలు ఎవరూ కూడా ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టî డీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. బుధవారం ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మార్గాని భరత్, సంజయ్‌కుమార్‌లతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

 ఓటుకు నోట్ల కేసులో ఏసీబీకి దొరికిపోయి ఢిల్లీకి వచ్చి మొరపెట్టుకున్నాడో..సీఎం వైయస్‌ జగన్‌ను అసభ్య పదజాలంతో..హిందీలో బోషిడికే అని తిట్టించి..దాన్ని సమర్ధించుకోవడానికి చంద్రబాబు ఢిల్లీకి వచ్చాడా అని ప్రశ్నిస్తున్నా.. రాష్ట్రంలో గవర్నమెంట్‌ స్పాన్సర్డ్‌ టె్రరరిజమ్‌ నడుస్తుందని అక్కడ చెప్పి ఇక్కడ ఢిల్లీ పెద్దలను ఆర్టికల్‌ 356 అమలు చేయమని అభ్యర్థించేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 

ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే..2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనటువంటి పార్టీ టీడీపీ. చివరకు ఢిల్లీలో వ్యవస్థలను మేనేజ్‌ చేసేందుకు వచ్చాడా? రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు ఏం చెప్పారు. మా పార్టీ అధికార ప్రతినిధి సీఎం వైయస్‌ జగన్‌ను బోషిడికే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేందుకు ఢిల్లికి వచ్చాడా?. తను వాడిన అసభ్య పదజాలం..మంచిది అని చెప్పేందుకు రాష్ట్రపతిని కలిశాడా? తాను 36 గంటల బూతుల సమర్ధత దీక్ష చేశాడా అని చెప్పేందుకు ఇక్కడికి వచ్చాడా అని ప్రశ్నిస్తున్నా..

రాష్ట్రంలోని అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబే. రాష్ట్రపతికి ఏం చూపించాడని ప్రశ్నిస్తున్నా..ఆ రోజు అయ్యన్నపాత్రుడు గంటా శ్రీనివాసరావు విడుదల చేసిన వీడియో చూపించాడా?. లేక పట్టాభి సీఎం వైయస్‌ జగన్‌ను దూషించిన వీడియో చూపించాడా?. అప్పట్లో ప్రధాని మోదీని తిట్టిన సీడీని రాష్ట్రపతికి చూపించాడా? లేక హోం మంత్రి అమీత్‌షా తిరుపతి వచ్చినప్పుడు రాళ్లు వేసింది చూపించాడా?. 

బోషిడికే అన్నది తిట్టుకాదు..మంచి పార్లమెంట్‌ లాంగ్వేజీ అని చెప్పేందుకు రాష్ట్రపతిని చంద్రబాబు కలిశాడా?. టీడీపీ పుట్టింది మొదలు ఎన్టీరామారావు చనిపోయే వరకు ప్రతి మహానాడులో కూడా 356ను రద్దు చేయాలని తీర్మానం చేశారు. అదే ఆర్టికల్‌ను అమలు చేయాలని చంద్రబాబు ఈ రోజు రాష్ట్రపతిని కోరడం ఎంతవరకు సమంజసం.

అన్ని ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు. దీన్ని బట్టీ ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, టీడీపీకి ఎంత ప్రజాధరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఉద్దేశం ఏంటంటే..సీఎం వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని ఫూర్‌లైట్లో చూపించడం, రెండు అబ్యూజ్‌డ్‌ లాంగ్వేజ్‌. తాను 14 ఏళ్లు సీఎంగా పనిచేశాడు. అనుభవం ఉన్న వ్యక్తికి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్, ఇంటెంపరేట్‌ లాంగ్వేజ్‌ వాడకూడదని చంద్రబాబుకు తెలియదా? కచ్చితంగా తెలుసు. ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ఎవరైనా కూడా అనుచిత వ్యాఖ్యలు వాడుతారో..ఆ సందర్భాల్లో ప్రజలు తిరగబడుతారని అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి నారాయణరావు ఉద్ధవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే..ఆ సందర్భంలో ప్రజలు తిరగబడింది మనం మరచిపోలేదు. అలాగే యూపీ  బీజేపీ వైస్‌ ప్రెసిడెంట్‌ దయాశంకర్‌సింగ్‌ ముఖ్యమంత్రి మాయవతిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలంతా తిరగబడ్డారు. ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి..నాయకుడిపైన ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే తిరగబడటం అన్నది స్పాంటెనెస్‌గా వచ్చే సందర్భం. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు.

మన దేశం సెక్యూలర్‌ దేశం. ఇక్కడ భిన్న మతాలు, కులాలు ఉన్నాయి. ఇందులో సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒ క్కరి సెంటిమెంట్‌ను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుంది. అసభ్య పదజాలంతో సీఎంను దూషించి రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించడమే చంద్రబాబు ఉద్దేశం. 

మాదక ద్రవ్యాల విషయానికి వస్తే..చంద్రబాబు చేసిన ముఖ్యమైన ఆరోపణ. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారని, దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు చేస్తున్న ఆరోపణ. 2019కి ముందు చంద్రబాబు కేబినెట్‌లో పని చేసిన అప్పటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పట్లో మీ మంత్రి అయ్యన్న పాత్రుడి వీడియోలు వినండి. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు అత్యధికంగా ఉన్నాయని మీ మంత్రులే ఆరోపణలు చేసుకున్నారు. గంజాయి వ్యాపారంలో లోకేష్‌కు వాటాలు ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు చంద్రబాబు చట్టాన్ని ఉల్లంఘించి..తను మాదక ద్రవ్యాల వ్యాపారం చేసి మా ప్రభుత్వంపై బురద జల్లడం నిజంగా శోచనీయం.

రాష్ట్రంలో టీడీపీ ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందంటే..చంద్రబాబుకు రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై ఎలాంటి నమ్మకం లేకపోవడమే. ఎప్పుడు ఏ పార్టీతోనైనా కలవవచ్చు..ఎప్పుడైనా విడిపోవచ్చు అన్నది చంద్రబాబు నైజం. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజం చంద్రబాబుది. ఆయనకు నీతి, న్యాయం, ధర్మం అన్నది ఏమీ చంద్రబాబుకు ఉండవు. 

చంద్రబాబు నిజమైన రంగులన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ రోజు రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందన్న అక్షర సత్యం. ఇక తను మాత్రమే వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ..తన అనుచరులతో ప్రభుత్వంపై అసభ్య పదజాలంతో ఆరోపణలు చేయడం,  ట్రబుల్‌ క్రియేట్‌ చేయడం, ఆలయాల్లో విగ్రహాలు పగులగొట్టించడం, అసాంఘిక శక్తులన్నింటిన్ని ప్రోత్సహించడం చంద్రబాబు చేస్తున్న పనులు.ఒక బాధ్యత యుతమైన ప్రతిపక్ష నేత పాత్ర పోషించకుండా అసాంఘిక శక్తులను ప్రోత్సహించడం న్యాయమేనా. 

మాయవతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ రోజు ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కానీ ఈ రోజు చంద్రబాబును పట్టాభిని సమర్ధిస్తూ..కనీసం చర్యలు కూడా తీసుకోని దుర్మార్గపు వ్యక్తి చంద్రబాబు అని అర్థం చేసుకోవచ్చు.
ఆర్టికల్‌ 356 అమలు చేయాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఈవిల్‌ డిస్సైర్స్‌తో అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు తీరుతో చాలా మంది బాధపడుతున్నారు. 
స్టేట్‌ స్పాన్సర్డ్‌ టె్రరరిజమ్‌ గురించి మాట్లాడాల్సి వస్తే..చంద్రబాబు నాయుడే ఒక టె్రరరిస్టు..చంద్రబాబు టె్రరరిస్ట్‌ అవుట్‌పుట్స్‌కు ఒక నాయకుడు. ఇక ఆయన స్టేట్‌మెంట్‌ను మనమే అర్థం చేసుకోవచ్చు. రౌడీ ఎలిమెంట్స్‌కు చంద్రబాబే నాయకుడని ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు.

ఈ రకంగా ప్రతిరోజు చంద్రబాబు న్యూసెన్స్‌ క్రియేట్‌ చేయడం, రాష్ట్రంలో శాంతిభద్రతలను అడ్డుకోవడం, వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఈ రోజు మాదక ద్రవ్యాలపై ఏపీ డీజీపీ ప్రెస్‌మీట్‌ ద్వారా పూర్తి వివరణ ఇచ్చారు. విజయవాడలో ఇంటి అడ్రస్‌ ఇచ్చారని కేంద్ర విచారణలో తేలింది. దాన్ని పట్టుకుని ఏపీ అంతా డ్రగ్స్‌మయం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్‌ఐఏ కూడా ఏపీకి డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేస్తూ ఏపీ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. 

గతంలో దేశంలోని ప్రతీ రాజకీయ పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకుని, ఓడిపోయిన తరువాత తిరిగి ఆ పార్టీలతో విడిపోయిన వ్యక్తి చంద్రబాబు, పార్టీ టీడీపీ.గత రెండు రోజులుగా ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు అందరి రాజకీయ నాయకులను కలిసేందుకు ప్రయత్నిస్తే..ఎవరూ కూడా ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. రాష్ట్రపతిని ఏదో మొక్కుబడిగా కలిశారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కేంద్ర హోం మంత్రిని కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ అడిగితే ఆయన కూడా ఒప్పుకోలేదు. చంద్రబాబు రంగులు అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు కాబట్టే..భవిష్యత్‌లో టీడీపీతో పొత్తుపెట్టుకునేందుకు ముందుకు రారని ఇప్పటికే చంద్రబాబుకు అర్థమైంది. ఎందుకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తావని నేను ప్రశ్నిస్తున్నాను. ఇకనైనా మీ నడవడిక మార్చుకొని ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు  ప్రయత్నిస్తే..అప్పుడే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారని చంద్రబాబు గమనించాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం  ఒక చట్టాన్ని తీసుకురావాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో వైయస్‌ఆర్‌సీపీ కేంద్రాన్ని డిమాండు చేస్తుందని తెలిపారు. చట్టం తీసుకురాకపోతే పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెడతాం. జ్యూడిషియల్, ఎగ్జిక్యూటివ్‌కు ఆ మాత్రం రక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అప్పటి కేంద్ర మంత్రులు పాటించిన సాంప్రదాయాలను మనమంతా పాటించాలి. ఈ రోజు కొనసాగించలేని పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉన్నారు..అది ఎవరు చేసినా కూడా తప్పే. భావోద్రేకాలను ఎవరు కూడా రెచ్చగొట్టకూడదు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ప్రజల భావోద్రేకాలను రెచ్చగొడుతున్నారు. అది చేయవద్దని మేం పదే పదే చెబుతున్నాం.

పట్టాభి అన్న వ్యక్తి ఇవాళ మాల్దీవ్‌కు వెళ్లాడు. ఎందుకంటే చంద్రబాబు ఎంత స్వార్థపరుడంటే రేపు పట్టాభికి భౌతికంగా ఏదైనా జరిగితే దాన్ని వైయస్‌ఆర్‌సీపీపై రుద్దగలిగిన చాకచక్యం కలిగిన వ్యక్తి చంద్రబాబు. గతంలో చంద్రబాబు చరిత్ర గమనిస్తే..మోసం, దగా ఆతనికి  వెన్నతో పెట్టిన విద్య. పుట్టుకతో వచ్చిన అలవాటు. అందుకే పట్టాభి భయపడి మాల్దీవ్‌కు వెళ్లి దాక్కున్నారు. చంద్రబాబుకు భయపడి పట్టాభి మాల్దీవ్‌కు వెళ్లాడని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 

 

Back to Top