హైదరాబాద్: తప్పు చేస్తే ఏ శిక్ష కైనా తాను సిద్ధమని వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు. సండూరు పవర్ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించింది నా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారు డిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారు కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది కేవీ రావు నాకు తెలియదు అని చెప్పాను అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు కాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదు కేవీ రావు ను తిరుమలకు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పాను నేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధం మే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి రావు చెపుతున్నాడు కాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చు నేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదు కేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి అని కోరాను రంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించింది నాకు సంబంధం లేదు అని చెప్పాను నేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమే శ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పాను శరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారు కుటుంబ రీలేషన్ అని చెప్పాను కాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు లుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళాను కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పాను విక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారు విక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదు సండుర్ పవర్ కంపెనీలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను