గుంటూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా జరుగుతున్నాయని, రెండో రోజు సమావేశాలకు రాష్ట్ర నలుమూలల నుంచి నాలుగు లక్షల 50 వేల మంది హాజరవుతారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వైయస్‌ఆర్ ప్రాంగణంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ సమావేశాల మొదటి రోజు లక్ష 15 వేల 872 మంది భోజనం చేశారు. మా అంచనాలు 70 వేలు అయితే. మాకు వచ్చిన సమాచారం ప్రకారం లక్ష 68 వేల మంది హాజరయ్యారు. జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 4.50 లక్షల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. టీడీపీ బహిరంగ సభ నిర్వహించారు. మేం జరుపుతున్నది ప్రతినిధుల సభ. పార్టీకి పార్టీ నాయకుడి పట్ల ప్రజల్లో ఉన్న విశ్వసనీయత, అభిమానం పూర్తిగా బహిర్గమవుతోంది. అధికార దుర్వినియోగం ఎక్కడా జరగలేదు. ఎవరి వద్ద ఒక్క పైసా కూడా డొనేట్ చేయలేదు. ఎవరి వద్ద ఉచితంగా తీసుకోలేదు. ప్లీనరీ ఎందుకు నిర్వహిస్తున్నామంటే..గత మూడేళ్ల పాటు ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ పథకాలు, ప్రజల నుంచి వస్తున్న స్పందన. ప్రజల నుంచి ప్రతిస్పందన తీసుకొని ఎలా సేవ చేయాలనే దానిపై తీర్మానాలు చేస్తున్నాం. ఎన్నికల కమిషన్ అనుమతితో ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ప్లీనరీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ రోజు ప్లీనరీలో అది స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ 4.50 లక్షల మంది స్వచ్ఛందంగా ఉత్సాహంతో వస్తున్నారు. టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు. పోలవరం, బోగాపురం, ఇతర పరిశ్రమలపై ఎల్లోమీడియా హైలెట్ చేయకుండా అభివృద్ధి లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు గొప్పలు చెప్పుకునే గుణం ఉంది. మేం అలా కాదు..ఎప్పుడైనా చేసి చూపిస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం మేం నెరవేర్చాం. అందుకే మా నాయకుడిపై ప్రజల్లో విపరీతమైన, అంతులేని అభిమానం ఉంది. రాబోయే రోజుల్లో ఇంతకంటే గొప్పగా మా నాయకుడు చేస్తాడు. పార్టీని ఏ రకంగా ప్రతిష్టం చేయాలి? క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి? కమిటీల నియామకం ఎలా ఉండాలి? ప్రజలందరి మనసులను కులాలు, మతాలకు అతీతంగా ఆకట్టుకోవాలనే ప్రధాన అంశంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. మాకు ఏ పార్టీతో పొత్తు లేదని, వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 25 పార్లమెంట్ స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాం. చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అధికార దాహంతో మేం చేస్తున్న పనులను ఓర్వలేక అసూయ, ధ్వేషంతో మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ రోజు ప్లీనరీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. వాతావరణాన్ని బట్టీ ..మాకు ఉన్న ప్లాన్ ఆఫ్‌యాక్షన్ ప్రకారం పార్టీ అధ్యక్షులు 4 గంటలకు ఉపన్యాసం చేస్తారు. వాతావరణాన్ని బట్టీ మధ్యాహ్నం 3 గంటలకు మార్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇవాళ పార్టీ అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. ఆ తరువాత పార్టీ అధ్యక్షుల ముగింపు ప్రసంగం ఉంటుంది. నిన్న కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టాం. ఈ రోజు కొన్ని తీర్మానాలు ప్రవేశపెడుతామని చెప్పారు. మా ఫోకస్ అంతా కూడా విద్యా, వైద్యం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మీడియా బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయాలన్నదే మా ఉద్దేశమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.