న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కలిశారు. సీఎం వైయస్ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎంపీ మాధవ్ అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించేలా చట్టాలను కఠినతరం చేయాలని కేంద్ర మంత్రికి గోరంట్ల మాధవ్ వినతిపత్రం అందజేశారు.