మైనారిటీల‌కు ఇంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డం వైయ‌స్ జ‌గ‌న్‌కే సాధ్యం

సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ జకియా ఖానం

తాడేప‌ల్లి :మైనారిటీలకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్య‌మంత్రి వైయ‌స్  జగన్ మోహ‌న్ రెడ్డికే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ జకియా ఖానం కొనియాడారు.  నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన జకియా ఖానం సోమవారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాల‌యంలో క‌లిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ..సామాన్య కుటుంబానికి చెందిన త‌న‌ను ఎ‍మ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైయ‌స్ జగన్‌ అన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని, రాయచోటి అభివృద్ధికి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళా సమస్యలపై పోరాటం చేసి పరిష్కారానికి చొర‌వ చూపుతాన‌ని చెప్పారు.  తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

వైయ‌స్ జ‌గ‌న్ మాట ఇస్తే త‌ప్ప‌రు

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట ఇస్తే ఎప్ప‌టికీ త‌ప్ప‌ర‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి పున‌రుద్ఘాం‌టించారు.   సీఎం వైయ‌స్ జగన్‌ ఆశీస్సులతో ఒక మైనారిటీ మహిళకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఆనందంగా ఉందని  అన్నారు. మహిళల సమస్యలపై ఆమె స్పందిస్తార‌ని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top