వైయస్‌ జగన్‌ పాలనలో మహిళలకు భరోసా, భద్రత

నారీ దీక్షకు బాబు డైరెక్షన్‌..లోకేష్‌ స్క్రీన్‌ప్లే

మహిళలంటే చంద్రబాబుకు చిన్న చూపు 

టీడీపీ హయాంలో మహిళలపై దాడులు 

టీడీపీ పాలనలో మహిళలపై జరిగిన దాడులను అనిత ఎందుకు ప్రశ్నించలేదు

విశాఖ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో మహిళలకు భద్రత, భరోసా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేర్కొన్నారు. టీడీపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగితే ఆ రోజు నోరు మెదపని మాజీ ఎమ్మెల్యే అనిత ఈ రోజు నారీ దీక్ష చేపట్టడం సిగ్గు చేటు అన్నారు. 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు కారకుడైన టీడీపీ నేత వినోద్‌ జైన్‌ను కాపాడేందుకు చంద్రబాబు డైరెక్షన్‌లో..నారా లోకేష్‌ స్క్రీన్‌ప్లేతో అనిత దీక్ష చేపట్టారని విమర్శించారు. విశాఖలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడారు.

మొన్న నారా లోకేష్‌ పీఏ భాగోతం బయట పడింది. నిన్న విజయవాడలో వినోద్‌ జైన్‌ అరాచకం వెలుగు చూస్తే..రేపు నారా లోకేష్‌ తాలుకు భాగవతాలు ఇంకేమి బయటకు వస్తాయోమోనని భయపడి అనితా దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు చంద్రబాబు డైరెక్షన్‌ అయితే..స్క్రీన్‌పై నారా లేకేష్‌ అన్నారు. గత 40 ఏళ్ల టీడీపీ కార్యాలయాన్ని గమనిస్తే..దుశ్శాసనులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఆ టీడీపీ నాయకులకు మహిళలంటే గౌరవం, భక్తి, అభిమానం లేదు. ఎంతసేపు మోసం చేద్దాం, దగా చేద్దామనే ఆలోచనే వారిది. చంద్రబాబు గత ఐదేళ్ల పాలన,

 14 ఏళ్లుగా సీఎంగా ఉండి మహిళలకు ఏం చేశారో..గత రెండేళ్లలో వైయస్‌ జగన్‌ ఏం చేశారో తెలుసుకొని మాట్లాడాలి. మహిళలకు ఎంతగా రక్షణగా నిలిచారో..ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారో తెలుసుకోవాలి. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో మహిళలకు కనీస గౌరవం ఉండేది కాదు. కోడలు మగ బిడ్డను కంటాననంటే అత్త వద్దంటుందా అని హేళనగా మాట్లాడారు. మహిళలకు ఎంత చులకనభావమో అర్థం చేసుకోవచ్చు. ఆయన హయాంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. ఎంతో మంది పురుషులు మహిళలపై దాడి చేశారు. లైంగికంగా వేధించారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కుంభకోణంలో టీడీపీ నేతలే ఇన్వాల్వ్‌ అయ్యారు. 

చంద్రబాబు హయాంలో ఓ మహిళా తహశీల్దార్‌ను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుట్టుపట్టుకొని కొడుతుంటే ఇవాళ దీక్ష చేస్తున్న మహిళలు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయారు. మాజీ ఎమ్మెల్యే అనితకు విశాఖ జిల్లా జె్రరిపోతులపాలెంలో ఓ దళిత మహిళను టీడీపీ నేతలు జుట్టుపట్టుకొని ఈడ్చికెళ్తే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న మీరు అప్పుడేందుకు నారీ సంకల్ప దీక్ష చేయలేదు. 

ఇదే విశాఖ జిల్లా గాజువాకాలో లావణ్య అనే మహిళ హత్యగావించబడింది. మీ టీడీపీ నేతలే రూ.10.50 లక్షలకు సెటిల్‌మెంట్‌ చేశారు. అప్పుడెందుకు ఇలాంటి దీక్షలు చేయలేదని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారింది. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే 43 వేల బెల్ట్‌షాపులను మూసేయించారు. 33 శాతం మద్యం షాపులను వైయస్‌ జగన్‌ తొలగించారు. అక్కచెల్లెమ్మల రక్షణ కోసం వైయస్‌ జగన్‌ ఎన్నో చట్టాలు తీసుకువచ్చారు. అందులోభాగంగానే దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. 

వైయస్‌ జగన్‌ పాలనలో ఏపీలోని మహిళలందరూ తన సొంత అన్న సీఎంగా ఉంటే ఎంత భరోసా, భద్రతగా ఫీలవుతారో..అదే భద్రతతో మహిళలు ఉన్నారు. దేశంలో ఎంతో మంది మహిళ ముఖ్యమంత్రులు పాలించారు. వారి రాష్ట్రాల్లో ఏర్పాటు కాని చట్టాలు మన రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేశారని గర్వంగా చెబుతున్నాను. వైయస్‌ జగన్‌ వద్ద ఓ ప్రజాప్రతినిధిగా పని చేస్తున్న నేను ఈ మాటలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. 

దిశ చట్టాన్ని అసెంబ్లీలో వైయస్‌ జగన్‌ ప్రవేశపెడితే టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లి ఆ ప్రతులు చించేశారు. దీన్నిబట్ట మహిళలపై టీడీపీ నేతలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. ఈ రోజు దిశ చట్టం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే దిశ చట్టంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నిస్తున్నాను. దిశ చట్టాన్ని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదు. మహిళలపై ఎవరైనా లైంగికంగా వేధించినా వారం రోజుల్లోగా ఛార్జ్‌షిట్‌ వేస్తున్న ఏకైక సీఎం వైయస్‌ జగన్‌ మాత్రమే. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో మహిళల కోసం ఇలాంటి చట్టాలు ఎందుకు తీసుకురాలేదని టీడీపీ నేతల్లారా ఒక్కసారి ప్రశ్నించండి. 

రాష<ంలో కేసులను త్వరగా విచారించేందుకు 19 మంది పీపీలను, 18 దిశ చట్టాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ స్థాయి అధికారులను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక మహిళా పోలీసును ఏర్పాటు చేశారు. 10 ఫోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులను ఏర్పాటు చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు.   అంతగా మహిళా రక్షణ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న వ్యక్తి వైయస్‌ జగన్‌..ఇలాంటి ముఖ్యమంత్రిపై మాట్లాడేందుకు టీడీపీ మహిళలకు నోరు ఎలా వస్తుందని వరుదు కల్యాణి నిలదీశారు. ఆడపిల్లలు ఇతరులపై ఆధారపడకూడదని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టార ని ఎమ్మెల్యే వరుదు కల్యాణి వివరించారు. 
 

Back to Top