సచివాలయం: శాసనమండలి చైర్మన్ క్షమించరాని తప్పు చేశారని, షరీఫ్‌కు చైర్మన్ స్థానంలో ఉండే అర్హత లేదని శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా సభ నడపడం చేతకానప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలు అతిక్రమించడానికి విచక్షణాధికారం వాడకూడదని, మండలి చైర్మన్ రాజ్యాంగాన్ని, మండలి రూల్స్‌ను ఉల్లంఘించారన్నారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపేందుకు ఆస్కారమే లేదని, చైర్మన్ షరీఫ్ టీడీపీ కార్యకర్తలా చంద్రబాబు ఆదేశాలను అమలు చేశారన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపాలంటే సభ ఆమోదం పొందాలని తెలియకపోతే ఎలా..? అని, షరీఫ్‌కు చైర్మన్ స్థానంలో ఉండే అర్హత లేదన్నారు.