అనంతపురం: మానవత్వమే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి మతమని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు.శనివారం ఇక్బాల్ మీడియాతో మాట్లాడారు.
రాజకీయ లబ్ధి కోసమే కొందరు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజల్లో తప్పుడు సంకేతాఉ పంపేలా కొందరు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మత సామరస్యం కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. దేశంలోనే మూడో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేరుగాంచారని తెలిపారు. డీజీపీ ప్రకటనతో నారా లోకేష్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అఖిలప్రియ ఘటనపై టీడీపీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో టీడీపీ వెంటిలేటర్‌పై ఉందని ఇక్బాల్ పేర్కొన్నారు.
మహ్మద్ ఇక్బాల్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు ఇలా..
- అంతర్వేది రథం దగ్దమైన ఘటనలో దిగజారుడు ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
- చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌ఐఏ, సీబీఐ, ఈడీ, ఐటీ ఎవ్వరూ రాష్ట్రానికి రావొద్దు అన్నారు.
- వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లేలా ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపేలా కొందరు కుట్ర చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
- డీజీపీ ప్రకటనతో చంద్రబాబు, అచ్చెన్నపాత్రుడు, అయ్యన్నపాత్రుడు, లోకేశ్ తదితరులు ఎందుకు భయపడుతున్నారు?
- మత సామరస్యం కాపాడేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మానవత్వమే మతం
- కుల, మత, వర్గ బేధాలు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అందువల్లనే సర్వేలో దేశంలో మూడో ఉత్తమ సీఎంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చారు.
- దేవాలయాల పరిరక్షణ వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం బాధ్యత. సీఎం వైయస్ జగన్ తీసుకుంటున్న చర్యలను అందరూ స్వాగతిస్తున్నారు.
- రాష్ట్రంలో టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది.అఖిలప్రియ ఘటనపై టీడీపీ ఎందుకు స్పందించటం లేదు?
- నంద్యాల ఉప ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని టీడీపీ ప్రచారం చేసింది. అభివృద్ధి, సంక్షేమం మీదనే ఓట్లు అడిగితే 151 సీట్లు ప్రజలు ఇచ్చారు
- నాకంటే గొప్ప హిందువు వైవీ సుబ్బారెడ్డి, ఆయన కుటుంబం అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు.
- టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆడిటింగ్‌ను కాగ్ ద్వారా చేయాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయించారని బీజేపీ ఎంపీనే చెప్పారు.
- ప్రజల్లో సీఎం వైయస్ జగన్ గారికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబుకు కడుపు మంటగా ఉంది
- పాస్టర్ ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మతసామరస్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- బీజేపీ మెప్పుకోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు.
- ఇప్పటికే టీడీపీకి ప్రజలు సమాధి కట్టేశారు. ఆ విషయం చూడకుండా మత విద్వేషాలు కోసం కుట్ర చేస్తున్నారు. ఇలాంటివి ఈ ప్రభుత్వం ఉపేక్షించదు.
- తిరుమలపై జీఓ ఇచ్చి, అన్యమత ప్రచారం జరగకూడదని చర్యలను మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి హయాంలోనే చేపట్టారు.
- రాష్ట్రంలో ప్రజల మధ్య మత సామరస్యం ఉంది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు దిగజారుడు అనైతిక రాజకీయాలు మానేయాలి. కుళ్లు, నీచ రాజకీయాలు చంద్రబాబు మానుకోవాలి