వైయస్‌ జగన్‌ శాశ్వత ముఖ్యమంత్రి 

బీసీలకు కావాల్సింది తాయిళాలు, పప్పు బెల్లాలు కాదు

వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

విజయవాడ: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి కాదని, శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలంటే జనాభాలో అధికశాతం ఉన్న బీసీలు అండగా నిలవాలని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిన్న వయసులోనే అనేకమైన సంస్కరణలు, చట్టాలు చేసి ఇతర రాష్ట్రాలకు దార్శనికుడిగా నిలిచిన ఏకైన నాయకుడని కొనియాడారు. విజయవాడలోని బీసీ సంక్రాంతి సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి అంటే చేతివృత్తులవారికి, గంగిరెద్దుల వారికి, తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా సంక్రాంతి చేసుకుంటారు. కానీ ఈ రోజు నెల ముందే రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం.

బీసీలు నెల ముందే సంక్రాంతి పండుగ చేసుకోవడం శుభపరిణామం. గతంలో బీసీలకు ఎన్నికల ముందు తాయిళాలు ఇచ్చే వారు. కానీ ఇవాళ వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక బీసీలకు పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి నిజమైన పండుగ చేసుకునేలా చేశారన్నారు. దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగేలా వైయస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌. రాష్ట్రంలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కాగానే ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నారని ఇతర రాష్ట్రాలు మనవైపు చూస్తున్నారు. చిన్న వయసులోనే వైయస్‌ జగన్‌ఇంత గొప్పగా ఎలా పాలిస్తున్నారని ఇతర ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారు. పరిపక్వత చెందిన ప్రజా నాయకుడిగా వైయస్‌ జగన్‌ అన్ని వర్గాలకు, రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటే ప్రజా సంకల్ప యాత్రలో వారి కష్టాలు చూశారు కాబట్టే ఇలాంటి పాలన చేస్తున్నారు.  

దేశంలో 2900 బీసీ కులాలు ఉన్నాయి. మన రాష్ట్రలో 139 కులాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో చాలా కులాలు నిరాధరణకు గురయ్యాయని వైయస్‌ జగన్‌పాదయాత్రలో గ్రహించి, 139 కులాలను వదిలిపెట్టకుండా 56 కార్పొరేషన్లు, 672 డైరెక్టర్‌ పదవులు ఇచ్చిన ఘనత వైయస్‌ జగన్‌దే. మనకు కావాల్సినంది తాయిళాలు కాదు..పప్పు బెల్లాలు కాదు. మనకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రుణపడి ఉంటాం. ఏ ఆశయంతోనైతే మనకు ఈ కార్పొరేషన్లు, డైరెక్టర్‌ పదవులు ఇచ్చారో గ్రహించి, ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా పని చేయాలి. చిన్న వయసులోనే అనేకమైన సంస్కరణలు,చట్టాలు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. వైయస్‌ జగన్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి కాదు..శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు. అందరం కూడా వైయస్‌ జగన్‌కు తోడుగా ఉండాలి. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చాలి. అందరం కూడా ఆ దిశగా పని చేద్దాం. బీసీ వర్గాలకు చెందిన నాయకులుగా రాబోయే రోజుల్లో ఎదగాలని కోరుకుంటూ..కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్‌ పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు రాష్ట్రంలోని బీసీల తరఫున జంగా కృష్ణమూర్తి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

 

Back to Top