ఎమ్మెల్సీ జకియా ఖానంకు వైయ‌స్ఆర్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదు

 ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
 

తాడేపల్లి: ఎమ్మెల్సీ జకియా ఖానంకు వైయ‌స్ఆర్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదన్నారు శాసనమండలిలో ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కూటమి సర్కార్‌ ఏర్పడిన తర్వాత ఆమె టీడీపీలోకి వెళ్లినట్టు చెప్పారు. తిరుమలలో వీఐపీ టిక్కెట్లు ఆమె అమ్ముకున్నట్టు వచ్చిన ఆరోపణలతో మాకు సంబంధం లేదు అంటూ కామెంట్స్‌ చేశారు. 

శాసనమండలిలో ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పుడు వైయ‌స్ఆర్‌సీపీలో లేరు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. పలు సందర్భాలలో మంత్రి లోకేష్‌తో ఆమె భేటీ అయ్యారు. 

కాగా, జాకియా ఖానం తిరుపతిలో వీఐపీ టికెట్లు విక్రయిస్తున్నారు. ఆరు టికెట్లను రూ.65వేలకు అమ్మారు. ఈ నేపథ్యంలో భక్తులు ఈ విషయాన్ని టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎమ్మెల్సీ సహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా చంద్రశేఖర్‌, ఏ2గా జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్‌వో కృష్ణతేజ పేర్లను చేర్చారు. అయితే, ఏపీలో కూటమి సర్కార్‌ అధికారంలోకి రాగానే ఆమె టీడీపీలో చేరారు. మంత్రులు లోకేష్‌, ఫరూఖ్‌ను కలిసి తన మద్దతు ప్రకటించారు. 

 డయేరియా బాధితులకు ఎమ్మెల్సీ బొత్స ప‌రామ‌ర్శ‌
విజయనగరం జిల్లాలో డయేరియా తీవ్రత తగ్గడం లేదు. ఇవాళ మరో ఇద్దరు డయేరియా బారినపడ్డారు. ఆసుపత్రిలోనే ఇంకా 145 మంది బాధితులు ఉన్నారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. గుర్లలో అప్రకటిత బంద్‌ కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలతో గుర్ల వైద్య శిబిరంలో 3 బెడ్లను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం ఖాళీ చేసి రోగులు లేరంటూ అధికారులు చూపిస్తున్నారు.డయేరియా బాధితులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడూతూ, డయేరియాతో జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ⁠ఇవి సహజ మరణాలు కాదని.. ⁠ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలుషిత నీరు తాగడం వల్లే గుర్లతో పాటు పలు గ్రామాల్లో  ఈ మరణాలు సంభవించాయని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారక లెక్కల ప్రకారం 11 మంది చనిపోయారని ప్రకటించిగా.. బాధిత గ్రామాల ప్రజలు మాత్రం మరో ఐదుగురు డయేరియాతోనే చనిపోయినట్లు చెపుతున్నారన్నారు. ఇవాళ డయేరియా ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన బొత్స... గ్రామాల్లో పారిశుద్ద్యం లోపం, కలుషిత నీటి వల్లే డయేరియా వ్యాప్తి చెందిందని, ఇది ప్రభుత్వ పర్యవేక్షణ లోపమేనని తేల్చి చెప్పారు.

డయేరియా మృతులది సహజ మరణం కాదని కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన మరణాలు కాబట్టి... చనిపోయిన వారి కుటుంబాలకు 
తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

డయేరియా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం... గత వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేయడాన్ని బొత్స తప్పుపట్టారు. 
జిల్లా చరిత్రలో గతంలో డయేరియాతో ఇంత మంది మృత్యువాత పడిన ఘటనలు లేవన్నారు. 
అధికారులు ఇప్పటికైనా బాధిత గ్రామాల్లో ఇంటింటికి సర్వే చేసి.. తగిన నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు వారికి కావాల్సిన మందులు, మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు.

Back to Top