జేసీ బ్రదర్స్ ఆగడాలపై పోలీసులు సీరియస్ గా స్పందించాలి

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
 

తాడిపత్రి :  టీడీపీ నేత‌లు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, దివాక‌ర్‌రెడ్డి ఆగ‌డాల‌పై పోలీసు ఉన్న‌తాధికారులు సీరియ‌స్‌గా స్పందించాల‌ని తాడేప‌ల్లి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాన్ని  ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు.  ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ గూండాలాగా  ప్రవర్తించారు. పోలీసులపై జేసీ అనుచిత ప్రవర్తన సరికాదు.. పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన అంటూ ప్రశ్నించారు. ఒక ప్రజాపతినిధిగా పనిచేసిన వ్యక్తి పోలీసులను హిజ్రాలతో పోల్చడం దారుణమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారన్నారు. దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీలపై లోతుగా విచారించి జేసీ బ్రదర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దారెడ్డి కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top