ఎస్సీ, ఎస్టీలు తరతరాలుగా పేదవారిగా మిగిలిపోవాలా?

దళితులను అవమానించిన చరిత్ర చంద్రబాబుది

 ఎమ్మెల్యే వరప్రసాద్‌

అసెంబ్లీ: తరతరాలుగా ఎస్సీలు, ఎస్టీలు పేదవారిగానే మిగిలిపోవాలా అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌ ప్రశ్నించారు. 
ప్రత్యేక ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.  ఎస్సీ, ఎస్టీలు తరతరాలుగా పేదవారిగా మిగిలిపోయారు. రిజర్వేషన్లు ఉన్నా కూడా అసమానతలు అలాగే ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను అవమానించారు. ఒక్క సంక్షేమ పథకం కూడా అమలుచేయకుండా అన్యాయం చేశారు. ఎవరైనా దళితులుగా పుట్టి ఉండాలని కోరుకుంటారా అని చంద్రబాబు చులకనగా మాట్లాడారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడా?  చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలకు చేసింది ఏమీలేదు. మాజీ  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులను ఉద్దేశించి మీకేందుకురా రాజకీయాలు అన్నప్పుడు చంద్రబాబు కంట్రోల్‌ చేయలేదు. చంద్రబాబు కేబినెట్‌లోని మరో మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరని దూషించారు. దేశంలో 70 సంవత్సరాలైన తరువాత దీర్ఘ ఆలోచనలో ఉన్న ఏకైక వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే. నవరత్నాలు ఏవిధంగా పేదవారికి ఉపయోగపడుతుందో టీడీపీ నేతలు ఆలోచన చేయాలి. ఇంగ్లీష్‌ మీడియం పెడతామంటే టీడీపీ నేతలు వ్యతిరేకించారు. పేదవాడు ఉన్నత చదువులు చదవకూడదని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమ్మ ఒడి పథకాన్ని ఆలోచన చేయండి.  ఎస్సీ, ఎస్టీలపై టీడీపీకి ప్రేమలేదు. చర్చ జరుగుతుంటే అడ్డుపడటం సిగ్గు చేటు. పేదవాళ్లు బాగుపడొద్దని చంద్రబాబు ఉద్దేశ్యం. 
 

Back to Top