ఆ ముగ్గురి మెదళ్లు మొద్దుబారాయి

బుర్ర‌లేని లోకేశం, ఆంబోతు అచ్చెన్నాయుడు, పసలేని పట్టాభి 

పంచాయతీ, మున్సిపల్‌ ఫలితాలతో టీడీపీ నేతల మైండ్‌ బ్లాంక్

బీజేపీతో తైతక్కలాడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే

హోదా కోసం రాజీనామా చేసిన చరిత్ర వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల‌ది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు

తాడేపల్లి: పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీ నేతల మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందని, బుర్ర‌లేని లోకేష్, ఆంబోతు అచ్చెన్నాయుడు, పసలేని పట్టాభి ముగ్గురు మెదళ్లు మొద్దుబారిపోయాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ధ్వజమెత్తారు. అబద్ధాలే పనిగా, అసత్య ప్రచారాలే ఆయుధాలుగా దొడ్డిదారి రాజకీయాలు నేర్చుకున్న టీడీపీ నాయకులు.. పదే పదే రాష్ట్ర ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు జరుపుతున్నారని మండిపడ్డారు. పనికిమాలినవాడని లోకేశంని వాళ్ల నాన్న చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకువస్తే.. అమ్మగారి మద్దతులో మంత్రి పదవి సాధించుకొని.. మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయినా బుద్ధి రాలేదన్నారు. లోకేశం సన్నబడినా బు్రరమొద్దుబారే ఉందన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. మంగళగిరిలో ఓ ఇంటికి సంబంధించి ఆక్రమణలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వ అధికారులు.. వాటిని తొలగిస్తే లోకేశం గుండె జారిపోయినంత పనైందంట. అదే మంగళగిరికి కూతవేటు దూరంలో ఉన్న తుళ్లూరు, మందడం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 44 వేల ఎకరాల భూముల్లో 54 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి ఆపించిన చరిత్రను లోకేష్‌ మరిచిపోయాడా..? 

ఆంబోతు అచ్చెన్నాయుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం విడ్డూరం. టీడీపీ, బీజేపీ జతకట్టి.. తైతక్కలాడిన చంద్రబాబు.. ఆంధ్రరాష్ట్ర పరువు, భవిష్యత్తును మోడీ కాళ్ల దగ్గర పణంగా పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం ఏపీని చంద్రబాబు సర్వనాశనం చేశాడు. ఆ చరిత్రను ఆంబోతు అచ్చెన్నాయుడు ఎలా మరిచిపోయాడు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలను గొ్రరెల్లా ఆంబోతు అచ్చెన్నాయుడు సంబోధించాడు. మా పార్టీ ఎంపీలు చేసిన త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోదు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన చరిత్ర వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలది. 

పనికి మాలిన పట్టాభి చెత్త ప్రెస్‌మీట్లు పెడుతూ ప్రజల్లో విషబీజాలు నాటాలనే కుయుక్తులు పన్నుతున్నాడు. ‘సాక్షి’లో వచ్చిన ప్రధాన ప్రకటన ద్వారా ప్రభుత్వ విధానాన్ని సుస్పష్టం చేశాం. రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగిందని, దానికి సీఎంకు సంబంధం ఉందని పసలేని పట్టాభి చెత్త ప్రకటన చేశాడు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతుంది. 3sఐదేళ్ల టీడీపీ పాలనలో ఉచిత ఇసుక విధానం పేరుతో రూ.50 వేల కోట్లు స్వాహా చేసినట్లేనని ఒప్పుకున్నట్లేనా..? 

ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక నూతన విధానంతో ప్రైవేట్‌ కంపెనీలకు సంవత్సర కాల లక్ష్యం 2 కోట్ల టన్నులు మాత్రమే. ఒక టన్నుకు రూ.475 ధర నిర్ణయించాం. రెండు కోట్ల టన్నులు సరఫరా చేస్తే.. రూ.950 కోట్లు వసూలవుతుంది. దీంట్లో నిర్వాహణ సంస్థకు మిషినరీ, కూలీలు, ఎంప్లయీస్, ఇతరత్రా ఖర్చులు రూ.200 కోట్లు పోను, రూ.750 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది’ అని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టం చేశారు.

Back to Top