వైయస్‌ జగన్‌ విలువలతో కూడిన రాజకీయాలు చేద్దామన్నారు

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
 

అమరావతి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేద్దామన్నారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు. రాజకీయ విలువలకు కట్టుబడి గెలిచిన 90 రోజుల్లోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. పార్టీ మారినందుకు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి వదులుకున్నానని చెప్పారు. చంద్రబాబుకు విలువలు లేవని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన వారిని కొనుగోలు చేయడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. చట్టాన్ని ఆయనకు చుట్టంగా చేసుకున్నారని, ఫిరాయింపులపై అనర్హత వేటు వేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.

35 వేల జనాభా ఉన్న సున్నిపెంట గ్రామాన్ని 35 ఏళ్లుగా రాజకీయాలు చేసిన బుడ్డా, ఏరాసు కుటుంబాలు విస్మరించాయన్నారు. సున్నిపెంటను గ్రామ పంచాయతీగా మార్చాలని సీఎం వైయస్‌ జగన్‌ను కోరిన 15 రోజుల్లోనే పంచాయతీగా మార్చారని చెప్పారు. అలాగే ఆత్మకూరు నగర పంచాయతీని గ్రేడ్‌–3 పంచాయతీగా మార్చారని తెలిపారు. సున్నిపెంటలో కాపురం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలు రెగ్యులరైజ్‌ చేయాలని సీఎంను ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. 
 

Back to Top