జోరు వానాలో `గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం`

నంద్యాల‌: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. నంద్యాల జిల్లా శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలోని బండిఆత్మ‌కూరు మండ‌లంలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి జోరు వానాలో గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే,  ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు ఘన స్వాగతం ప‌లికారు. ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి బి కోడూరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఉదయం నుంచి వర్షం సైతం లెక్కచేయకుండా ప్ర‌తి ఇంటికి వెళ్లి ప్ర‌జా స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో ఎలాంటి వివ‌క్ష లేద‌ని, లంచాల‌కు తావు లేకుండా అర్హ‌తే ప్రామాణికంగా  అరుహుడైన ప్రతి  లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు.  ఇళ్ల‌ స్థలాలు మంజూరైన లబ్దిదారులు గృహాలు నిర్మించుకునేందుకు అవ‌స‌ర‌మైన సిమెంట్‌, ఇనుమును ఆల‌స్యం చేయ‌కుండా అంద‌జేస్తున్నామ‌ని ఎమ్మెల్యే తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top