విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు  

విద్యార్థుల‌కు ట్యాబ్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి
 

నంద్యాల‌: రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా విద్యా రంగంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం పరితపిస్తున్నార‌ని శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కొనియాడారు. బుధ‌వారం వెలుగోడు జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యార్థుల కోసం అమ్మ ఒడితో ఆదరించి, గోరుముద్దుతో ఆకలి తీర్చి ,విద్యా కానుకతో గౌరవించి, ఆంగ్ల మాధ్యమాన్ని అందించిన మహా వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కోసం మనబడి, నాడు నేడు కార్యక్రమం, నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నార‌ని చెప్పారు. విద్య కానుక కింద స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్ ,ఒక జత షూ, పుస్తకాలు, నోట్ బుక్కులు  ప్ర‌తి ఏటా పంపిణీ చేస్తున్నార‌ని వివ‌రించారు. ఈ అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకొని చ‌దువులో రాణించాల‌ని సూచించారు. అనంత‌రం   8వ తరగతి విద్యార్థులకు 647 ట్యాబ్‌లు అంద‌జేశారు. కార్యక్రమంలో  శ్రీశైలం నియోజకవర్గ నాయ‌కుడు శిల్ప భువనేశ్వర్ రెడ్డి, ఎంపీపీ లాలం ర‌మేష్‌, స‌ర్పంచ్ జ‌య‌పాల్‌,  ఎంఈఓ బ్రహ్మం నాయక్, పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు అంబాల ప్రభాకర్ రెడ్డి, నాయ‌కులు తిరుపంరెడ్డి, ఇలియాస్ ఖాన్, అమీర్ అలీ ఖాన్,   సయ్యద్ సులేమాన్ , త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top