స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలి

హైకోర్టులో వైయ‌స్ఆర్‌సీపీ పిటిషన్ 

తాడేప‌ల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ తరఫున న్యాయవాది పొన్నవోలు వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కచ్చితంగా కేంద్ర బలగాలను ఏర్పాటు చేయాలని కోరారు.

పుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి, కడప ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయన్న అంశాలను పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను హైకోర్టు కోరింది. తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.

Back to Top