క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది 

జిల్లా స్థాయి క‌బ‌డ్డీ పోటీల‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి

నంద్యాల‌:  క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి అన్నారు. వెలుగోడు జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో శిల్పా స‌హ‌కారంతో ఏర్పాటు చేసిన క‌ర్నూలు, నంద్యాల ఉమ్మ‌డి జిల్లాల క‌బ‌డ్డీ పోటీల‌ను శుక్ర‌వారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క్రీడాకారుల‌ను ప‌రిచ‌యం చేసుకొని, శాంతి క‌పోతాలు ఎగుర‌వేశారు. క్రీడాకారుల‌కు దుస్తులు పంపిణీ చేసి ప్రోత్స‌హించారు. విద్యార్థులు చ‌దువుతో పాటు క్రీడ‌ల్లో రాణిస్తే మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని చెప్పారు. జిల్లా స్థాయి క‌బ‌డ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి రూ.25 వేల న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తామ‌న్నారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top