అన్నదాతలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

 ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

విజ‌య‌వాడ‌:  అన్నదాతలకు అడుగడుగునా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను  అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతుభరోసా, వైఎస్ఆర్ సున్నావడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవాపథకాల కింద రైతులకు రూ.2,190 కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందని తెలిపారు. 50.37 లక్షల మందికి రూ.2,052 కోట్లతో వైఎస్ఆర్ రైతుభరోసా, 6.67 లక్షల మందికి రూ.112.70 కోట్లతో వడ్డీ రాయితీ, యంత్ర పరికరాలకు రూ.25.55 కోట్లతో సబ్సిడీ సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు జమచేయడం జరిగిందన్నారు. 50.37 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ రైతుభరోసా ఖరీఫ్‌ కోతలు, రబీ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు వైఎస్ఆర్ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమ చేయడం జరిగిందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు తొలివిడతలో దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,811.96 కోట్లు జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌలుదారులు, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులతో సహా 50.37 లక్షల మందికి రెండోవిడత సాయం అందజేయడం జరుగుతుందని, వైఎస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద 2019 నుంచి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారన్నారు. దీనిలో రూ.7500 మే నెలలోను, రూ.4 వేలు అక్టోబర్‌లోను, మిగిలిన రూ.2 వేలు జనవరిలోను జమ చేయడం జరుగుతుందన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top