సీపీఐ అంటే చంద్ర‌బాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మారింది

చంద్ర‌బాబు హ‌యాంలో బాత్‌రూమ్‌ల పేరుతో దోపిడీ

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

తిరుప‌తి:  భార‌త క‌మ్యూనిస్టు పార్టీ(సీపీఐ) అర్థాన్ని ఆ పార్టీ నేత నారాయ‌ణ మార్చేశార‌ని, సీపీఐ అంటే ఇప్పుడు చంద్ర‌బాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చేశార‌ని వైయ‌స్ఆర్ సీపీ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమ‌ర్శించారు. నారాయ‌ణ సీపీఐ పార్టీకి త‌ల‌వంపులు తెస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. పేద‌ల‌కు ఇచ్చే ఇళ్ల స్థ‌లాలు కుక్క‌లు క‌ట్టేసేంత కూడా లేవ‌న్న నారాయ‌ణ వ్యాఖ్యాల‌ను ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో గుడిసెలు వేసే ప‌ని లేకుండా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేద‌ల‌కు ఇళ్లు ఇస్తున్నార‌ని చెప్పారు. క‌మ్యూనిస్టులు సీఎంగా ఉన్న చోట ఇన్ని ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చారా అని ఆమె ప్ర‌శ్నించారు. నారాయ‌ణ సీపీఐ జెండాను వ‌దిలేసి..చంద్ర‌బాబు అజెండాను భుజానికి ఎత్తుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇళ్ల‌ను బాత్ రూమ్‌ల‌తో పోలుస్తూ పేద‌ల‌ను టీడీపీ నేత నారా లోకేష్ అవ‌మానించార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు హ‌యాంలో బాత్‌రూమ్‌ల పేరుతో దోచుకున్నార‌ని గుర్తు చేశారు.అందుకే ఏది చూసినా లోకేష్‌కు బాత్‌రూమ్‌లాగే క‌నిపిస్తుంద‌ని ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top