దివ్యాంగులకు త్రిచక్ర మోటార్ వాహనాల‌ అందజేత...

 మంగ‌ళ‌గిరి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వ‌ర్యంలో దివ్యాంగుల‌కు మూడు చ‌క్రాల మోటార్ వాహ‌నాల‌ను అంద‌జేశారు. మంగ‌ళ‌గిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో క‌లిసి ఎమ్మెల్యే ఆర్కే  దివ్యాంగులకు వాహ‌నాల‌ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో దివ్యాంగులు కూడా దివ్యమైన వారే అని వారికి పూర్తిస్థాయిలో అండగా ఉండాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్  తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవన్నారు. నవరత్నాలు పథకంలో భాగంగా దివ్యాంగులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్ఫూర్తిగా  మరొక అడుగు ముందుకు వేసి ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో 8 త్రిచక్ర మోటార్ వాహనాలను దివ్యాంగులకు అందజేసిన‌ట్లు చెప్పారు. 
ఈ త్రిచక్ర మోటార్ వాహనాలు సుమారు ఒకొక్కటి 1 లక్ష 20 వేల రూపాయ‌లు విలువ ఉంటుందని అన్నారు. 
గుంటూరు కలెక్టర్ వద్ద నియమ నిబంధనల ద్వారా ఎంపిక చేయడం జరిగిందని, ఇంకా ఎవరైనా అవసరమైన వారు వాలంటీర్ల ద్వారా సచివాలయంలో అప్లై చేసుకుంటే భవిష్యత్తులో వారికి కూడా అర్హతను బట్టి ఇటువంటి వాహనాలు అందజేస్తామ‌ని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Back to Top