మగాళ్లైతే టచ్‌ చేసి చూడండి

చంద్రబాబు పక్కా పథకం ప్రకారమే దాడి చేయించారు

తన ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు అల్లర్లు సృష్టిస్తున్నారు

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి

గుంటూరు:  చంద్రబాబు రాజధాని ప్రాంతంలో తమ ఆస్తులు కాపాడుకునేందుకు అల్లర్లు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. మగాళ్లైతే మమ్మల్ని టచ్‌ చేసి చూడాలని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. చిన్నకాకాని వద్ద తనపై పథకం ప్రకారమే రైతుల ముసుగులో టీడీపీ గుండాలు దాడి చేశారని పేర్కొన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబుతో కలిసి పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..పిన్నెళ్లి మాటల్లోనే..
ఇవాళ ఉదయం 12.30 గంటల ప్రాంతంలో విజయవాడ వెళ్తుండగా చిన్నకాకాని వద్ద ధర్నా చేస్తుండగా నేను సర్వీస్‌ రోడ్డుపై వెళ్తున్నాను. నా కారు చూసి మాచెర్ల ఎమ్మెల్యే వెళ్తున్నారని ఒక్కసారిగా 50 మంది  నా కారుపై అటాక్‌ చేశారు. ఏంటని ప్రశ్నిస్తే నా గన్‌మెన్‌ను కూడా కొట్టారు. కారుపై పెద్ద పెద్ద రాళ్లు వేసి ధ్వంసం చేశారు. చంద్రబాబును అడుగుతున్నాను. నా కారుపై రాళ్లు వేసినంతమాత్రానా మీ సమస్య తీరుతుందా?. రాజధాని రైతులకు ఏదైనా సమస్య ఉంటే సీఎం వైయస్‌ జగన్‌తో చర్చలు జరపండి. మీకు ఎలాంటి న్యాయం కావాలో సీఎం చేస్తారు. దయచేసి చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు. నాపై దాడి చేసిన వ్యక్తులు ఎవరూ కూడా రైతులు కాదు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడి చేసేందుకు చంద్రబాబు కొంత మంది వ్యక్తులను ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఫ్రీ ప్లాన్డు.  అప్పుడప్పుడు రాళ్లు, కర్రలు ఎక్కడి నుంచి వస్తాయి. చంద్రబాబు, ఆయన బినామీలు రాజధాని ప్రాంతంలో లక్షల కోట్లు కూడబెట్టుకున్నారు. కళ్ల ముందు వారి ఆస్తులు చెదిరిపోతున్నాయనే అసూయతో మాపై దాడులకు పాల్పడుతున్నారు.  శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇది సరైంది కాదు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై దాడి చేయాలనుకుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయనకు సంబంధించిన నాయకులు చేతనైతే, మీరు మగాళ్లు అయితే ముందుకు రండి..మమ్మల్ని టచ్‌ చేసి చూడండి..ఏం జరుగుతుందో చూద్దాం. రాజధాని ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో దాడి చేస్తూ శాంతిభద్రతల విఘాతం కల్పించడం సరికాదు. రాజధాని రైతులపై మాకు సానుభూతి ఉంది. వైయస్‌ జగన్‌ 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి వర్గాన్ని కలిశారు. చంద్రబాబు సీఎంగా ఉండి రాష్ట్ర ప్రజలకు ఏమి చేయలేదు. ఆయనకు సంబంధించిన కొంత మందికి మాత్రమే దోచి పెట్టారు. వైయస్‌ జగన్‌ ఈ రోజు అందరికి న్యాయం చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. మేమేమైనా పాకిస్థాన్‌ నుంచి వచ్చామా? మాపై దాడి చేస్తే ఏమీ రాదు. గతంలో చంద్రబాబు నాపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూశారు. చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నా..నిన్ను పుట్టించిన మీ అయ్య వల్ల కాదు మమ్మల్ని బెదిరించడం. నిజాయితీతో వైయస్‌ జగన్‌ వెంట నడుస్తున్నాం. రాజధాని రైతులు చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు. చంద్రబాబు అవుడ్ డెటేడ్‌ పొలిటీషియన్‌. ఆయన వెళ్లి మనవడితో అడుకోవడం మంచిది. నీ అవసరాల కోసం రైతులను దగా చేయవద్దు. 

 

తాజా వీడియోలు

Back to Top