ప్రధాని మోదీ మన సీఎం వైయస్‌ జగన్‌ను కొనియాడుతున్నారు

ఎమ్మెల్యే పార్థసారధి
 

విజయవాడ:  ప్రపంచమంతా ప్రధాని నరేంద్రమోదీని కొనియాడుతుంటే..ఆయన మాత్రం మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను పొగుడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. పునాదిపాడు జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం సభకు ఎమ్మెల్యే అధ్యక్షత వహించి, ప్రసంగించారు. పార్థసారధి ఏమన్నారంటే.. పెనుమలూరు నియోజకవర్గంలో విద్యా కానుక ప్రారంభించడం మన  అదృష్టంగా భావిస్తున్నాను. అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గతంలో విదేశీ సంస్థలకు, దోపిడీదారులకు భరోసా కల్పిస్తూ పాలన సాగింది. ఈ రోజు మనందరి ఆశీర్వాదంతో, చరిత్రలోనే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైయస్‌ జగన్‌ పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా నాడు–నేడు పనులు పరిశీలించడమే కాకుండా జగనన్న విద్యా కానుక ప్రారంభించేందకు సీఎం వైయస్‌ జగన్‌ వచ్చారు. గతంలో బాలికలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేసేవారు ఉండేవారు కాదు. ఈ రోజు నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఆధునీకీకరణ పనులు చేపట్టారు. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్కూళ్లకు పోటీగా విద్యనందించాలనే ఉద్దేశంతో మంచి వసతులు కల్పించారు. ఈ రోజు కొర్పారేట్‌ స్కూళ్లకు తీసిపోని విధంగా సౌకర్యాలు కల్పించారు. జగన్‌ మామయ్య విద్యా అనే ఆస్తిని పిల్లలకు ఇస్తున్నారు. నాలుగు రోడ్లు, పెద్ద పెద్ద భవంతులు కడితేనే అభివృద్ధి అనుకునే వారు. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ మోదీని కొనియాడుతుంటే.ఆ మోదీ మన సీఎంను పొగుడుతున్నారు. గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందించే సచివాలయ వ్యవస్థను పీఎం కొనియాడారు. 16 నెలల కాలంలో రూ.61 వేల కోట్లు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు గడప వద్దకే చేర్చారు. కరోనా సమయంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, ఆసరా, చేయూత పథకాల ద్వారా దాదాపు రూ.56 వేల కోట్లు మీ ఖాతాల్లోకే చేర్చారు. ఇంత గొప్పగా చేస్తున్నా కూడా మన రాష్ట్రంలోని ప్రతిపక్షం దురదజల్లే కార్యక్రమాలు చేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారి, కుట్రలు చేస్తున్నారు. ఇంతకంటే నీచ రాజకీయాలు ఎక్కడా ఉండవు. మా అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని ఎవరైనా ఆలోచన చేశారా? ఒకే రోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మా నాయకుడు వైయస్‌ జగన్‌ చ ఏపట్టారు. ఇళ్ల పట్టాలు అందకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు ఖబడ్ధార్‌..మీరు ఇలాగే కుట్రలు చేస్తే..ప్రజలు మీకు రాజకీయ సమాది చేస్తారని హెచ్చరిస్తున్నాను. మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు ఎమ్మెల్యే పార్థసారధి కృతజ్ఞతలు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top