వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌కు ప్రజల సంపూర్ణ మద్దతు 

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు

పూతలపట్టు:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు తెలిపారు. పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అదేశాల మేరకు సోమ‌వారం ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు బంగారు పాల్యం  మండలం, జిల్లేడు పల్లి సచివాలయం పరిధిలోని హాసన్ పురం, తంబుగాని పల్లి హెచ్ డబ్ల్యు గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హించారు.  ప్ర‌తి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించి, వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.  సంద‌ర్భంగా ఎమ్మెల్యే  .ఎం.ఎస్.బాబు మాట్లాడారు. గ్రామాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, జగనన్నే మా నమ్మకం అంటూ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ఎంతో విశ్వాసం ప్రకటిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం తమకేమీ చేయలేదన్న విషయాన్ని ప్రజలే స్పష్టం చేస్తున్నారన్నారు. రెండోసారి కూడా వైయ‌స్‌ జగన్‌ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని నూరు శాతం ప్రజలు అభిప్రాయపడ్డారని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, మహిళల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందన్నారు.   

Back to Top