సీఎంపై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
 

అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తప్పుపట్టారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి , సంక్షేమాన్ని కోరే వ్యక్తి చంద్రబాబు అయితే సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు బాగుంటే బాగున్నాయని, లేదంటే సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు సంక్షేమ పథకాలను కొనియాడుతుంటే..చంద్రబాబు మానసిక రోగిలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ మార్షల్స్‌ అడ్డువచ్చారని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వద్ద ఉన్న సెక్యురిటీ ఎవరిని కూడా దగ్గరకు రానివ్వరు. సభా సమయాన్ని చంద్రబాబు వృథా చేస్తున్నారు. ఒకప్పుడు సీఎంగా పని చేసిన చంద్రబాబు అసెంబ్లీలో మార్షల్స్‌ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. టీడీపీ ఎమ్మెల్యేలు సగం మంది అసెంబ్లీలో, సగం మంది పోడియం వద్ద ఉంటున్నారు. చంద్రబాబును తన ఎమ్మెల్యేలే నమ్మలేకపోతున్నారు. అందుకే అసెంబ్లీలో కాలు కాలిన పిల్లి మాదిరిగా ఉంది. రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది.

Back to Top