మేడా మల్లికార్జునరెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

రాజంపేట నుంచి భారీగా తరలి వచ్చిన మేడా అనుచరులు

హైదరాబాద్‌: అధికార తెలుగు దేశం పార్టీ విధానాలు నచ్చక, అవినీతిని సహించలేన టీడీపీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆ పార్టీని వీడారు. అలాగే టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలతో అందరికీ మేలు జరుగుతుందని గ్రహించిన మేడా మల్లికార్జునరెడ్డి ఇవాళ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌తో భేటి అయ్యారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి స్పూర్తితో ముందుకు వెళ్తున్న వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పని చేసేందుకు అంగీకరించి వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఆయనకు పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట వేలాది మంది కార్యకర్తలు, అనుచరులు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటానని, రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని, మళ్లీ ఆ నాటి సువర్ణ యుగం వస్తుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పార్టీ  మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top