హ‌త్యా రాజ‌కీయాల‌తో ఎదిగిన వ్య‌క్తి చంద్ర‌బాబు

ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డ శ‌వం క‌నిపిస్తే చాలు అక్క‌డ రాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. హ‌త్యా రాజ‌కీయాల‌తో ఎదిగిన వ్య‌క్తి చంద్ర‌బాబు అంటూ విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబును మించిన క్రిమిన‌ల్ దేశంలో మ‌రొక‌రు ఉండ‌ర‌న్నారు. వెన్నుపోటుకు పేటెంట్ రైట్ చంద్ర‌బాబుదే అన్నారు.చంద్ర‌బాబూ..శ‌వాల‌ను పీక్కుతినే రాజ‌కీయాలు మానుకోవాల‌ని మ‌ల్లాది విష్ణు హిత‌వు ప‌లికారు. 

బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురికావడం దళిత సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందని పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. టీడీపీ నేత నారా లోకేష్‌కు దళితుల గురించి ఏమీ తెలియదని అన్నారు. ఆయనకు దళితులపై ప్రేమ ఉంటే, రమ్య కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయాలో ఆలోచించాలన్నారు.  

ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రమ్య హత్య ఘటన రాజకీయం చేయోద్దన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని  హైజాక్  చేయడంలో దిట్టన్నారు. నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారని, త్వరలో లోకేష్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని గ‌ణేష్ హెచ్చ‌రించారు. 

Back to Top