జెండా పీకడానికి జనసేన సిద్ధం

బీజేపీ, జనసేన పొత్తుతో మాకేమీ నష్టం లేదు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ: జనసేన పార్టీ ఏపీలో జెండా పీకడానికి సిద్ధమైందని, ఆ పార్టీ బీజేపీతో విలీనానం చేయబోతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు పంపిస్తే పవన్‌ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ, జనసేన పొత్తు 2014లోనే ఉంది. 2019 ఎన్నికల్లో జనసేనను ప్రజలు తిరస్కరించారు. అందరూ కలిసి వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారు.పాచిపోయిన లడ్డూలంటూ గతంలో బీజేపీని పవన్‌ విమర్శించారు. బీజేపీ, జనసేన పొత్తుతో మాకేమీ నష్టం లేదు.

Back to Top