పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ

పేదలందరికీ నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల‌ పట్టాల‌ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ‌దేవి

క‌ర్నూలు:  పేద‌ర‌లంద‌రికీ న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో భాగంగా పార్టీల‌కు అతీతంగా అర్హులంద‌రికీ ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేస్తున్నామ‌ని ప‌త్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి పేర్కొన్నారు. కృష్ణగిరి మండలం  ఆగవెలి గ్రామంలో  ఇళ్ల‌ పట్టాల‌ పంపిణీ కార్యక్రమంలో బాగంగా  పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పాల్గొని ప్ర‌సంగించారు. ఆమె మాట్లాడుతూ..పేదల కష్టాలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న  సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ  నెరవేరుస్తారని చెప్పారు. రెండు విడ‌త‌ల్లో 30 లక్షల ప‌క్కా ఇళ్లను కట్టిస్తున్నార‌ని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ లబ్ధిదారులను ఎంపిక చేశామని, ఇది ఒక చారిత్రాత్మకమ‌ని చెప్పారు.  ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని ,ప్రజల కష్టాల్లో పాలుపంచు కుంటామని ఎమ్మెల్యే శ్రీదేవి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  కృష్ణగిరి మండల ఇంచార్జీ డాక్టర్ వెంకట్రాంరెడ్డి ,  మండల కన్వీనర్ ఆర్‌బీ వెంకట రాముడు, కూరువ సంఘం రాష్ట్ర డైరెక్టర్ సుకన్య, పత్తికొండ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కటారు కొండ మాధవరావు,  కే ఈ .సుభాషిణి, సింగిల్ విండో అధ్యక్షులు కంభాలపాడు బ్రహ్మ నంద రెడ్డి, కే ఈ దేవేంద్ర,  
ఆగావెలి తెలుగు వెంకటేశ్, కురువా రామాంజినేయులు, సుంకన్న ,బోయ తిమ్మప్ప,చిన్న మద్దయ్య, వడ్డే మద్దయ్యా, ఈడిగా వెంకటేశ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top