200 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

నెల్లూరు: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ క్రమంలో  ఆనం విజయకుమార్‌ రెడ్డి వారికి వైయ‌స్ఆర్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  అనుచ‌రులు సుమారు 200 మంది కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీ గూటికి  చేరిపోయారు. 31వ డివిజన్‌కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  ఈ సందర్బంగా విజయకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. అలాగే, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో అధికార పార్టీలకు చెందిన కార్యకర్తలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకపోవడంతో కూటమి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్‌పై మండిపడుతున్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Back to Top