బీసీలు, ఎస్సీలపై చంద్రబాబు కొత్త నాటకం

వైయస్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

బాబుది బడుగు, బలహీనవర్గాలను అణగదొక్కే పథకం

 బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా బాబుకు తెలియదు
 
బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు ఎప్పుడూ జరగనంత మేలు జరుగుతున్నందుకే బాబుకి గుబులు
 
బడుగు బలహీనవర్గాల తోకలు కత్తిరిస్తా.. తోలు తీస్తా అన్న బాబు మాటల్ని మరిచిపోలేదు
 
బడుగు, బలహీనవర్గాలకు అన్నివిధాలా అండగా నిలబడ్డ జగనన్న
 
బాబును బడుగు, బలహీనవర్గాలు ఎప్పటికీ నమ్మవు

 తాడేప‌ల్లి: అధికారంలో ఉన్నన్నాళ్ళు బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదని, ఆయన అమలు చేసిందల్లా ఆ వర్గాలను అణగదొక్కే పథకం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే  కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీల గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు అసలు బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తెలియదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను చంద్రబాబు అడుగడుగునా మోసం చేస్తే..  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ప్రకటించి మరీ ఈ వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తూ, వారికి అండగా నిలబడ్డారన్నారు. టీడీపీ హయాంలో ఆదరణ పథకం ద్వారా బలహీనవర్గాలకు ఇస్త్రీ పెట్టెలు, కల్లుగీత కార్మికులకు మోకులు ఇచ్చానని ఇంకా చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గు ఎక్కడలేదని పార్థసారథి నిలదీశారు. 

 రెండు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఆశ్చర్యకరంగా బీసీల గురించి, ఎస్సీల గురించి మొసలి కన్నీరు కారుస్తూ బీసీలకు, ఎస్సీలకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు, తన హయాంలో తానేదో న్యాయం చేసినట్లు ఈ వర్గాలను మోసం చేయడానికి కొత్త నాటకాలు వేస్తూ మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. మేకతోలు కప్పుకున్న క్రూరమృగంలా మరోసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తే.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ వర్గాలు తగిన శాస్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 

 2019 నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. ప్రతిసారీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల చేత ఛీత్కరించబడి, ఘోరంగా ఓడించినప్పటికీ బుద్ధిరాకుండా వాస్తవాలను పక్కనపెట్టి ఈ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల్లో వస్తున్న రాజకీయ చైతన్యాన్ని చూసి చంద్రబాబుకు గుబులు పుట్టుకుంది. తెలుగుదేశం పార్టీని కొన్నేళ్లపాటు మోసిన బలహీన వర్గాలు.. చంద్రబాబు చేసిన మోసాన్ని గుర్తించి జగన్ మోహన్ రెడ్డిగారికి అండగా నిలబడ్డారు. ఈవర్గాలకు జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పరిపాలనలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జరుగుతున్న మేలును చూసి.. ఇదే కొనసాగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతో, బెంగతో వణుకుతున్న చంద్రబాబు బీసీలకు, ఎస్సీలకు అన్యాయం జరుగుతుందంటూ కొత్త నాటకానికి తెరతీశారు.

 తమ హక్కుల కోసం, చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయమని బలహీన వర్గాలు ఆయన వద్దకు వెళితే..  ‘తోలుతీస్తాను.. తోకలు కత్తిరిస్తాను’ అని ఏవిధంగా అవమానించారో బలహీనవర్గాలు ఇంకా మర్చిపోలేదు. ఒక ఎస్సీ మహిళను టీడీపీ ​కార్యకర్తలు వివస్త్రను చేసి, కాళ్లతో తన్ని ఎలా హింసించారో ఇప్పటికీ దళితుల కళ్లల్లో కట్టినట్లు కనిపిస్తుంది.
- రాజ్యాంగపరంగా వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది బీసీ న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలగా పదోన్నతి పొందే అవకాశం ఉంటే,  బీసీలు నిజాయితీపరులు కాదు, బీసీలు ఎఫీషియంట్‌ కాదని కాన్ఫిడెన్షియల్‌ నివేదికను కేంద్రానికి పంపించింది బాబు కాదా? బీసీల ఉన్నతిని అడ్డుకుంది మీరన్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు.

 చంద్రబాబు ప్రవేశపెట్టిన 36 పథకాల్ని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం రద్దు చేసిందంటూ పత్రికా ప్రకటన ఇచ్చారు. నేను చాలెంజ్‌ చేస్తున్నా... టీడీపీకి చెందిన ఏ బలహీనవర్గం నేత అయినా, కార్యకర్త అయినా చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆ 36 పథకాలు చెప్పగలిగితే నిజంగానే బీసీలకు మేలు జరిగిందని చెప్పవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అణగదొక్కే పథకం తప్పితే.. ఆ వర్గాల ఉన్నతికి బాబు చేసిందేమీ లేదు. 
- బీసీల గురించి బాబు మాట్లాడిన మాటలు, ఆయన తీసుకువచ్చిన పథకాలు అన్నీ మోసపూరితమైనవే, చిత్తశుద్ధిలేవివే కానీ ఎక్కడా కూడా అమలుపూరితమైనవి కావు. టీడీపీ హయాంలో అసెంబ్లీని కూడా తప్పుదారిపట్టించి, అసెంబ్లీలో బడ్జెట్‌ అంకెల గారడీ చేసి, బలహీనవర్గాలకు ఇన్నివేల కోట్లు కేటాయించానని ఉపన్యాసాలు చెప్పుకుని అందులో పది శాతం కూడా ఖర్చుపెట్టిని చంద్రబాబు, ఈవాళ వాళ్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.

వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పరిపాలనలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం నేరుగా డీబీటీ విధానంలో వారి ఖాతాల్లోనే వచ్చి చేరుతుంది. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదలకు మేలు జరుగుతుంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అధికారంలో వాటా దక్కుతుంటే ఇది చూసి ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. 

 అమ్మ ఒడి, ఆసరా, చేయూత, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా.. తదితర సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఏ మేరకు లబ్ధి జరిగిందో.. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆర్థిక సాయమే కాకుండా లక్షలాదిమంది బలహీన, దళిత వర్గాలకు లక్షల విలువ చేసే ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు... తన హయంలో కనీసం పేదల ఇళ్ళ స్థలాల కోసం ఒక్క సెంటు భూమి అయినా కొన్నారా.. అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం.
-ఈ 26 నెలల పాలనలో అమ్మ ఒడి, ఆసరా, జగనన్న చేయూత, ఇళ్ల స్థలాలు, వడ్డీ లేని రుణాలు.. ఇవన్నీ తీసుకుంటే ఎటువంటి మధ్యవర్తులు, దళారులు లేకుండా దాదాపు రూ.50వేల కోట్ల రూపాయలును నేరుగా బలహీన వర్గాల మహిళల బ్యాంక్‌ ఖాతాలలో చేరిన మాట వాస్తవం కాదా?
-  నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 19 వేల కోట్లకు పైగా బీసీలకు ప్రయోజనాలు లభించాయి. ఇవన్నీ వాస్తవాలు. చంద్రబాబు హయాంలో ఇటువంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయా..?
- జగన్ గారి ప్రభుత్వం నేరుగా బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా అందించిన ప్రయోజనాలు రూ. 1.40 లక్షల కోట్లు అయితే, అందులో దళితుల వాటాగా అందినది రూ. 17 వేల కోట్లకు పైమాటే. నాన్ డీబీటీ స్కీములైన ఆరోగ్యశ్రీ,  జగనన్న తోడు, ఇళ్ళ పట్టాలు వంటివి కూడా కలుపుకుంటే.. దళితులకు అందిన ప్రయోజనాలు రూ. 24 వేల కోట్లకు పైమాటే.

 టీడీపీ హయాంలో ఆదరణ పథకం ద్వారా బలహీనవర్గాలకు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాను, కల్లుగీత కార్మికులకు మోకులు ఇచ్చానని చెప్పటానికి ... సిగ్గుందా చంద్రబాబు? ఇప్పటికీ వాళ్లను ఆవిధంగానే అణగదక్కాలనుకుంటున్నావా? సమాజంలో వారికి ఉన్నతవిద్యను అందించి వారిని ఉన్నతస్థానాల్లో ఉండేలా, మీరు ఎప్పుడైనా ఆలోచన చేయగలిగారా?

 ఈరోజు జగనన్న తీసుకొచ్చిన అమ్మ ఒడి లాంటి పథకాల ద్వారా.. ఏ బలహీన వర్గం తల్లి అయినా, మైనార్టీ వర్గాల తల్లి అయినా.. తన కొడుకును కూలి పనులు చేయించడం మాని కాన్వెంట్ చదువులు చదివిస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళను కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. దాంతో తమ పిల్లల్ని జగన్‌ మామయ్య చదవిస్తున్నాడు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాఠశాలల్లోనే టాయ్‌లెట్ల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆలోచనను మీరు ఎప్పుడైనా చేయగలిగారా చంద్రబాబు?

 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన, దళత, పేద వర్గాలకు ఉపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూడా ఇవ్వలేదు. మీకు తాయిలాలు, ముడుపులు చెల్లించే కాలేజీలకు ఇష్టం ఇచ్చినట్లు ఫీజులు పెంచుకునేలా అనుమతి ఇచ్చారే కానీ, బలహీన వర్గాలకు మేలు జరిగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని కూడా పెంచని మీరు,  కనీస జ్ఞానం లేకుండా  బలహీనవర్గాల గురించి మాట్లాడతారా..
- అదే వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రతి సంవత్సరం  సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ప్రకటించి మరీ, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారికి అండగా నిలబడ్డారు. 

10. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈ రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో కూడా తెలియదు. వైఎస్‌ జగన్‌గారు రాష్ట్రంలోని 139 బీసీ కులాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయించి, వారికి ఏవిధంగా చేస్తే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారని ఆలోచన చేసి, ఇవాళ 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్లను నియమించి, బలహీన వర్గాలు, దళితుల్లో రాజకీయ చైతన్యం కల్పించింది వాస్తవం కాదా?
- అదే టీడీపీ హయాంలో ఎంతమందికి నామినేటెడ్‌ పదవులు ఇచ్చారో ఒక్కసారి లెక్కలు తీయాలి. ఇవాళ నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం మహిళలకు, బలహీనవర్గాలు, దళితులకు అందరికీ రిజర్వేషన్లు కల్పించింది వాస్తవం కాదా? ఆ చట్టం ద్వారా కొన్నివేలమంది మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్లుగా, ఇతర పదవుల్లో బలహీన, దళిత, మైనార్టీ వర్గాల వారు పదవులు పొందారు. ఇదంతా మీ కళ్లకు కనిపించడం లేదా చంద్రబాబు గారూ?

 క్యాబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి అయిదు డిప్యూటీ సీఎంల పదవులు ఇచ్చి, దాదాపు 60 శాతం కంటే ఎక్కువ ఈ వర్గాలకు సంబంధించినవారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇటీవల నలుగురు రాజ్యసభ సభ్యుల్ని పార్టీ తరఫున ఎన్నిక చేసుకుంటే అందులో 50 శాతం బలహీన వర్గాలకే ఇచ్చారు. సుభాష్ చంద్ర బోస్‌గారు కానీ, మోపిదేవి వెంకట రమణగారికి అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎప్పుడైనా ఇది సాధ్యం అయిందా? అదే మీ హయాంలో అవకాశం వస్తే  రాజ్యసభ సీట్లను వంద కోట్లకు పెట్టుబడిదారులకు అమ్ముకున్నారని రాష్ట్రంలో పత్రికలు, రాజకీయ పార్టీలు, సమాజం కోడైకోసిన విషయం మర్చిపోయారా?
- బలహీనవర్గానికి చెందిన  బోస్‌గారికి, మోపిదేవికి రాజ్యసభ పదవులు ఇచ్చి జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి బలహీన వర్గాల పట్ల ఉన్న ప్రేమ, చిత్తశుద్ది ఏంటో సమాజానికి తెలియచేశారు. 26 నెలల పరిపాలనలో సంక్షేమ పథకాలకే ఏకంగా రూ. 1.40 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం.  ఏ పథకం తీసుకున్నా బలహీన, మైనార్టీ, దళిత వర్గాలను దృష్టిలో పెట్టుకునే అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది.

 అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో కళ్లు మూసుకుపోయి, ఎంతసేపూ కార్పొరేట్ శక్తుల అడుగులకు మడుగులు వత్తారే తప్ప, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల గురించి ఏరోజు అయినా ఆలోచించారా చంద్రబాబూ? రాష్ట్రంలో జరుగతుంది బలహీన, దళిత వర్గాల ప్రభుత్వం. ఇప్పటికైనా మీ మొసలి కన్నీరు ఆపేయండి. చంద్రబాబు చరిత్ర పూర్తయిపోయింది. ఆయన మాయమాటలు వినడానికి ప్రజలు ఎవరూ సిద్ధంగాలేర‌ని పార్థ‌సార‌ధి పేర్కొన్నారు. 

Back to Top