జగనన్న అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం 

మాజీ మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు(నాని)

వివేకాపై కాదు..."ఎన్టీఆర్‌ను తడిగుడ్డతో గొంతు ఎలా కోశారు" అన్న పుస్తకం వేయండి 
 
చంద్రబాబు వేసిన పుస్తకం చలిమంటకు కూడా పనికి రాదు 

 మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది... 

 వివేకా ఆస్తులు.. కూతురు, అల్లుడి పేరుమీదకు ఎలా వచ్చాయ్‌..? 

 మాజీ మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు (నాని)

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మేమే గెలుస్తాం 

 ఎన్నికల్లో విజయంపై మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌ దిశానిర్ధేశం చేశారు 

 175 నియోజకవర్గాల గెలుపే ధ్యేయంగా గడప గడపకూ ప్రభుత్వం 

 నూటికి నూరు శాతం 175 నియోజకవర్గాల్లో మేమే గెలుస్తాం 

 వైయ‌స్ జ‌గ‌న్‌ గారితోనే రాష్ట్రానికి భవిష్యత్తు. 
 
ఎన్టీఆర్‌ గొంతు కాదు...లోకేశ్ కు ఖర్జూరనాయుడు గొంతు వచ్చి ఉంటుంది.. 

మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)

 తాడేప‌ల్లి:   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు.  తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

*ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలూ మావే:*
- రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అవన్నీ మేమే గెలుచుకుంటాం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది
- మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలు ఉన్నాయి
- వీటిలో కూడా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని మా నాయకుడు మాకు దిశానిర్ధేశం చేశారు
- సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు దీనిపై దృష్టి పెట్టాలి
- ప్రజలకు సంబంధం లేని ఎన్నికలైనా మనం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సిఎం చెప్పారు
- గడప గడపకు వెళ్తున్న నేపథ్యంలో 175 నియోజకవర్గాలు గెలిచేలా ప్రతి ఒక్క  ఎమ్మెల్యే పనిచేయాలని చెప్పారు
- కొంత మంది కొంత తక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా సరిచేసుకోవాలని చెప్పారు
- ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేనపథ్యంలో 175కి 175 నియోజకవర్గాల్లో గెలవాలని ముఖ్యమంత్రి గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు
- పోటీ చేసే వారు, ఉన్న ఎమ్మెల్యేలు దీనిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని సూచించారు
- మాకున్న సర్వేల ప్రకారం 175 సీట్లు గెలవడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది

*175కి 175 సీట్లు గెలిచి చూపిస్తాం:*
- చంద్రబాబు, లోకేశ్, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు లాంటి పనికి మాలిన వాళ్లు సర్వేలంటూ మొరుగుతారు
- ఎవరికీ తెలియని సమాచారం కూడా ఏబీఎన్‌కు తెలిసినట్లు రాసేస్తాడు
- ఐప్యాక్‌ వాళ్లు సర్వే చేస్తారా..చేస్తారని రాధాకృష్ణకు ఎవరు చెప్పారు..?
- ఐప్యాక్‌ వాళ్లు స్ట్రాటజీ ఇస్తారు...ఎలా సరిచేసుకోవాలి అనేది చెప్తారు
- ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టాస్క్‌ను మేం కంప్లీట్‌ చేస్తాం
- 175కి 175 సీట్లు గెలిచి చూపిస్తాం
- కుక్కకాటుకు చెప్పుదెబ్బలా.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌తో పాటు పచ్చమీడియాకి జగనన్న అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం

*చంద్రబాబు గ్రాఫిక్స్‌తో ఎలా మభ్యపెట్టాడో కూడా చెప్తాం:*
- మార్చి 18 నుంచి 26 వరకు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం
- ఇప్పటికే గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు నియామకం చేపట్టాము
- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది
- మన హాయాంలో ఎటువంటి మార్పులు చేపట్టామో ప్రజల్లోకి తీసుకెళ్లామనేది గృహ సారథులు ప్రతి ఒక్క కుటుంబానికి వివరిస్తారు
- గతంలో చంద్రబాబు గ్రాఫిక్స్‌ తో ఎలా మభ్యపెట్టాడో కూడా వివరిస్తాం
- రాష్ట్రంలో దోచుకున్న డబ్బును అతని వాళ్లకు ఎలా పంచిపెట్టాడు అనేది కూడా చెప్తాం
-  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ లేదు..
- అంతేకాకుండా కోడ్‌ ఉన్న జిల్లాల్లో కొన్ని చోట్ల 23వ తేదీ నాటికి ఏకగ్రీవం అయిపోతాయి
- ఈ లోపు గృహసారథుల నియామకం, సమావేశాలు, శిక్షణ వంటి పనులు పూర్తి చేసుకుంటాం
- వీటితో పాటు పట్టభద్రులు, టీచర్స్‌ నియోజకవర్గాల్లోనూ మేం తిరిగి ప్రచారం చేస్తాం

*చంద్రబాబు వేసిన పుస్తకం చలిమంటకు కూడా పనికి రాదు:*
- ఇప్పుడు సోషల్‌ మీడియా యుగం వచ్చింది..ఇంకా ఐటీ నావల్లే వచ్చిందని చంద్రబాబు చెబితే ఎవరూ నమ్మరు.
- మరో వైపు చెత్త పుస్తకాలు వేస్తే ఎవడు చూస్తాడు..అవి చలిమంట వేసుకోడానికి కూడా పనికిరావు 
- ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోజూ రాసేది అదే కదా..!
- గతంలో ఇలాంటివి రాసీ రాసీ, వీళ్లంతా  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి   గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయగలిగారా..?
- "ఎన్టీఆర్‌ని తడిగుడ్డతో గొంతు ఎలా కోశారు... "అన్నది రాయమనండి
- తడి గుడ్డ ఇచ్చింది రామోజీరావు .. కాళ్లు పట్టుకుంది రాధాకృష్ణ... అనేదానిపై పుస్తకాలు వేయమనండి
- గొంతు నులిమింది చంద్రబాబు నాయుడు అనేది రాయాలి
- తండ్రికి వెన్నుపోటు పొడుస్తుంటే చూసి... ఆనందించింది ఎవరు? అనేది పుస్తకాలు వేయాల్సింది.

*మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది...:*
- మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ని లాక్కున్నాడు..
- దేనికీ పనికి రాని పప్పుగాడిని ఓ నాయకుడిలా ప్రజల మీదకు వదిలాడు
- రామారావు గారిని చంపితే.. ఇవన్నీ చంద్రబాబుకు వచ్చాయి.
- మరి ఇవన్నీ రావడానికి, వైయ‌స్ఆర్‌సీపీని వివేకానందరెడ్డి గారు స్థాపించారా..?... లేదు కదా..?.
- పార్టీని జగన్మోహన్‌రెడ్డిగారు పెడితే.. వివేకానందరెడ్డి గారు కాంగ్రెస్‌ పార్టీలో ఉండి...విజయమ్మ గారిపైనే పోటీ చేశారు.

-అయినా వివేకానంద రెడ్డి గారి లాంటి మంచి మనిషిని, మనసున్న నాయకుడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?

*వివేకా ఆస్తులు కూతురు, అల్లుడి పేరు మీదకు ఎలా వచ్చాయ్‌..?:*
- ఆయన చనిపోయిన రోజుకి వివేకా పేరున ఐదుపైసలు ఆస్థి ఉందా..?
- ఆయన ఆస్థి మొత్తం కూతురు, భార్య, అల్లుడి పేర్ల మీద ఎలా బదిలీ అయ్యాయి?
- ఎందుకు ఆ ఆస్తులన్నీ బదిలీ అయ్యాయో తెలియాలి.
- చంద్రబాబు లాంటి లఫూట్‌ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, కేసును తారుమారు చేస్తాడని సీబీఐ విచారణ కోరాం.
- మా ప్రభుత్వం వచ్చాక మేం విచారించుకుంటాం అని సీబీఐ విచారణ వద్దన్నాం
- సీబీఐ ఊళ్లోకి రావద్దంటూ చెప్పింది, జీవో ఇచ్చింది చంద్రబాబే..
- అలా సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా వివేకానందరెడ్డి గారిని చంపించింది చంద్రబాబే అని మా అనుమానం.

*ఎన్టీఆర్‌ గొంతు కాదు...లోకేశ్ కు ఖర్జూరనాయుడు గొంతు వచ్చి ఉంటుంది..:*
- తాత గొంతు వచ్చిందా లోకేష్ ...? రామారావు గారు బతికి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉంటాడు
- పొరపాటున కర్జూరనాయుడు గొంతు వచ్చింది అని చెప్పబోయి రామారావు గారి పేరు చెప్పి ఉంటాడు
- లోకేశ్‌ మందమతి కదా...ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పి ఉంటాడు
- టీచర్స్‌లో వ్యతిరేకత ఉందని ఎవరైనా టీచర్స్‌ వచ్చి చెప్పారా..?
- వారిలో అనేక యూనియన్లు ఉన్నాయి...టీడీపీకి అనుబంధ యూనియన్లు ఉంటాయి..వైయ‌స్ఆర్‌సీపీ యూనియన్లూ ఉంటాయి
- అందరూ కలిసి వచ్చింది ఎప్పుడు..? మాకు కావాల్సిన మెజార్టీ ఓటు
- నూటికి నూరు శాతం ఓట్లు ఎవరికీ రాదు కదా

తాజా వీడియోలు

Back to Top