వైయస్‌ఆర్‌ రూపాయికి వైద్యం చేస్తే..వైయస్‌ జగన్‌ రూపాయికే ఇళ్లు ఇస్తున్నారు  

ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి
 

విజయనగరం: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రూపాయికే  వైద్యం చేసి ప్రజల డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారని, ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేద ప్రజలకు రూపాయికే ఇళ్లు ఇస్తూ ప్రజా నాయకుడిగా పేరు పొందారని ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు.  విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వీరభద్రస్వామి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..పేదలకు సొంతింటి కలను నెరవేర్చుతూ..గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతున్నా..19 నెలల కాలంలో వైయస్‌ జగన్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు,అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఈరాష్ట్రంలో న్యాయానికి, అన్యాయానికి ..ఉపకారానికి, అపకారానికి పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇళ్లు పంపిణీ కార్యక్రమం ఉగాదికి జరగాల్సింది. ఈ రోజు వరకు ఆగిందంటే అది చంద్రబాబు వల్లే. ఆయన కోర్టుకు వెళ్లడంతో ఈ కార్యక్రమానికి ఆటంకం ఏర్పడింది. చిత్తశుద్ధి, ధృడ సంకల్పం ఉన్న వైయస్‌ జగన్‌ ముందు ఈ కుట్రలు ఎందుకు పనికిరావు. ఆ రోజు దివంగత మహానేత పాలనలో 3,500 మందికి విజయనగరంలో పట్టాలు ఇచ్చి..వైయస్‌ఆర్‌ కాలనీగా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలోనే ఇది పెద్ద కాలనీ. ఈ రోజు 12,301 మందికి పట్టాలు ఇస్తూ అంతకంటే పెద్ద కాలనీని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ రోజు..ఈ రోజు తాను ఎమ్మెల్యేగా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ వంద ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మిగతా డీ పట్టా భూమిని స్థానికులు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. జిల్లా అధికారులు రాత్రి పగలు కృషి చేశారు. ఇందులో రాజకీయ ప్రమేయం లేకుండా, ఎక్కడా అవినీతి లేకుండా పెద్ద కాలనీ ఏర్పాటు చేశారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రూపాయికి వైద్యం చేసి ప్రజల డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. పేద ప్రజలకు రూపాయికే ఇళ్లు ఇస్తూ ప్రజా నాయకుడిగా పేరు పొందారు. నాడు పాదయాత్రగా జిల్లాలో అడుగుపెట్టినప్పుడు మీకు ఇచ్చిన అపూర్వ స్వాగతాన్ని గుర్తు పెట్టుకొని..ఈ జిల్లాకు ఇంత పెద్ద మేలు చేయడం సంతోషంగా ఉంది. గత 15 రోజులుగా సీఎం వస్తున్నారని ప్రజలు ఆనందంగా ఎదురుచూస్తుంటే..ప్రతిపక్ష నేతలు ఎదో ఒక అవంతరాలు కలుగజేయాలని కుట్రలు చేస్తున్నారు. ఇంత పెద్ద కాలనీకి జేఎంఆర్‌ కాలనీగా నామకరణం చేసుకుంటాం. రానున్న కాలనీలో ఇది ఒక టౌన్‌ షిఫ్‌ అవుతుందని, విజయనగరానికి జంట నగరం అవుతుంది. ఉత్తరాంధ్రలో నాపై నమ్మకం ఉంచి, ఎమ్మెల్యేగా టికెట్‌ ఇచ్చి గెలిపించారు. విజయనగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మా వద్దకు రావడం సంతోషంగా ఉంది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన విజయనగరాన్ని ఇక్కడి నాయకులు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. టీడీపీ నాయకులు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నా ఎలాంటి మేలు చేయలేదు. విజయనగరాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేయాలని, తాగునీటిసమస్య, రోడ్లు ఏర్పాటు చేస్తే..జీవితకాలం మీకు రుణపడి ఉంటారు. విజయనగరంలో మెడికల్‌ కాలేజీని వైయస్‌ జగన్‌ మంజూరు చేశారు. త్వరలోనే దాన్ని పూర్తి చేసి మీరే ప్రారంభించాలని కోరుతున్నాం. మేమేకాదు..మా పిల్లలు, తరతరాలు మీ వెన్నంటే నడుస్తుందని మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నా..
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top