దమ్ముంటే ఐటీదాడులపై సీబీఐ విచారణ కోరాలి

చంద్రబాబుకు ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి సవాల్‌
 

 

అనంతపురం: ఐటీ దాడులపై సిగ్గు, లజ్జ లేకుండా టీడీపీ నేతలు బుకాయిస్తున్నారని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పల్లెల్లో మూడు విడిచినోళ్లనే నానుడి ఉందని, టీడీపీ నేతలు మాత్రం ఆరు విడిచిన దొంగలని ఎద్దేవా చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఐటీ దాడులపై టీడీపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరపమని ముందుకు రావాలని, విచారణ జరిపించుకొని నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. ఎప్పుడు అనుకూలం అయితే అప్పుడు నోరు విప్పుతారా..? రూ. 2లక్షల నగదు, 12 తులాల బంగారం కోసం ఆరు రోజులు సోదాలు జరుగుతాయా..? అని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఐటీ దాడులపై వాస్తవాలు కోరుతూ హైకోర్టులో టీడీపీ నేతలు స్వచ్ఛందంగా పిటీషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top