నేతన్నలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అండ  

పట్టుశాలి, పద్మశాలి కుటుంబాల ఆత్మీయ కలయికలో ఎమ్మెల్యే కంబాల జోగులు
 

శ్రీ‌కాకుళం:   చేనేత కార్మికుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అండ‌గా నిలిచార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. పట్టుశాలి, పద్మశాలి కుటుంబాల ఆత్మీయ స‌మ్మేళ‌నం  రాజాం పట్టణంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ.. నేతన్న నేస్తం ద్వారా సొంత మాగ్గాలు ఉన్న వారికి ఆర్ధిక సహాయం అందించామని, నేతన్నలను ప్రోత్సహించేందుకు ఆంధ్రుల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే వివరించారు. 
కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా అన్ని వర్గాల అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు.పట్టుశాలి, పద్మశాలి కుటుంబాలను ఆదుకునేందుకు కార్పొరేషన్ లో ఏర్పాటు చేయడమే కాకుండా చైర్మన్లు డైరెక్టర్లు పదవులు సైతం ఇచ్చినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. అనంతరం పట్టుశాలి, పద్మశాలి సంఘం నేత‌లు ఎమ్మెల్యే కంబాల జోగులును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్నూరు లక్ష్మణరావు, రాజాం టౌన్ యూత్ కన్వీనర్ వంజరాపు విజయ్ కుమార్, అధికార ప్రతినిధి ఆసపు సూర్యం,పట్టుశాలి, పద్మశాలి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బి. లలిత కుమారి, బసవరాజు మాస్టారు, మల్లేశ్వరరావు, వివేక్, శ్రీనివాస రావు, నల్ల శ్రీనివాసరావు, సూర్యం, పేకల లక్ష్మణరావు, అర్జున్ రావు, డి పి ఎల్ రావు, సప్తగిరి, మోహన్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top