ఇంగ్లిష్‌ మీడియం బోధనతో రాష్ట్రం ముందుకుపోతుంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
 

అసెంబ్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనతో పల్లెలు విడిచి పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. పిల్లల చదువు కోసం పల్లెలు అన్నీ ఖాళీ అవుతున్నాయని, వృద్ధులను వదిలి పట్టణాలకు వెళ్తున్నారన్నారు. నారాయణ, శ్రీచైతన్య లాంటి ప్రైవేట్‌ స్కూళ్లలో విద్యార్థులపై చాలా ఒత్తిడి తీసుకువస్తున్నారని, అందుకనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతు ఆదాయంలోనే మేజర్‌ షేర్‌ పిల్లల చదువుకోసమే పోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి ఉండదని, ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్మి, పేదలకు విద్య దీపం లభిస్తుందని ఇంగ్లిష్‌ మీడియం బోధన, నాడు – నేడు కార్యక్రమాలను సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువస్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువస్తున్న ఇంగ్లిష్‌ మీడియం బోధనతో ఎవరూ పల్లెలు విడిచి పట్టణాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉండదన్నారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఎంతో ముందుకుపోతుందన్నారు. బలహీనవర్గాలకు చెందినంత మాత్రాన బలహీనులు ఎవరూ కారని సమాజానికి మంచి మెసేజ్‌ ఇచ్చారని స్పీకర్‌ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి కాపు రామచంద్రారెడ్డి మాట్లాడారు.

Back to Top