అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మన చెంత ఉంటే..అదృష్టం మన పక్కనే ఉన్నట్టు అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పచ్చ మీడియా చెప్పే పైత్యపు కబుర్లు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. పచ్చ మీడియా అధినేత రామోజీరావు ఎంతటి ఘనుడో చూస్తున్నాం కదా అన్నారు. ప్రజల సొమ్మును దారి మళ్లించి, చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు ఆస్తులు పోగు చేసుకున్న పెద్దమనిషని తేలిందని అన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని నీతులు చెబుతూ ఉంటారని, మీడియా పేరు చెప్పి, ప్రజలకు మంచి చేసే జగనన్న పై విషం కక్కుతుంటారని విమర్శించారు. ప్రజల సొమ్ములను పక్కదారి పట్టించడమే కాదు, ప్రజా ప్రభుత్వాల్లో తలదూర్చి, తను వెనకుండి నడిపిస్తాను, వ్యవస్థల మీద పెత్తనం చేస్తానంటే జగనన్న చూస్తూ ఊరుకోడని అన్నారు. లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదని, చంద్రబాబు నాయుడు ఎన్ని జాకీలు పెట్టి లేపినా ఫలితం లేదని ఎద్దేవా చేశారు. అద్భుతమైన స్పందన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకు వెళుతున్నామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఇంటింటికి తిరుగుతుంటే అద్భుతమైన స్పందన వస్తుందని అన్నారు. మా ఇంట్లో జగనన్న వల్ల మంచి జరిగింది, తప్పకుండా జగనన్నకే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న జ్యోతి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లారు. వారి కుటుంబానికి అందిన సంక్షేమ పథకాల వివరాలు తెలిపారు. వైయస్ఆర్ పించన్ కానుక ద్వారా.....రూ.80,000 జగనన్న అమ్మ ఒడి ద్వారా.....రూ.29,000 వైయస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా.....రూ.63,531 వైయస్సార్ రైతు భరోసా ద్వారా.....రూ.40,500 వైయస్సార్ సున్నా వడ్డీ (రైతులు) ద్వారా.....రూ.5,648 ఇంటి స్థలం ద్వారా.....రూ.2,00,000 ఇల్లు..... రూ.2,50,000 మొత్తం చేకూరిన లబ్ధి రూ.6,68,679 అక్షరాల ఆరు లక్షల అరవై ఎనిమిది వేలా ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలని వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు జ్యోతి మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలన్నీ సమయానికి అందుతున్నాయని అన్నారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా మా బ్యాంక్ అకౌంట్ల లో పడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.