బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్‌గా ఉంటే ఓర్వలేకపోతున్నాడు

చంద్రబాబును సభ నుంచి సస్పెండ్‌ చేయాలి

ఎమ్మెల్యే జోగి రమేష్‌

అసెంబ్లీ: బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్‌ స్థానంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సభలో జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్‌ను బెదిరిస్తూ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు కించపరిచినట్లే..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కించపరిచినట్లే..మీరు స్పీకర్‌గా ఎన్నికైనప్పుటి నుంచి కూడా చంద్రబాబు అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఆ చైర్‌లో కూర్చుంటే ఓర్వలేకపోతున్నారు. నీ అంతు చూస్తానని స్పీకర్‌ను బెదిరిస్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే మీకు వచ్చే నష్టం ఏంటి? ఈ రోజు స్పీకర్‌ వ్యవస్థను ఖూనీ చేసింది చంద్రబాబే. స్పీకర్‌గా మీరు హుందాగా ఉంటే..బలహీన వర్గాలను కించపరిచిన చంద్రబాబును సస్పెండ్‌ చేయాలి. బీసీలకు న్యాయం జరగాలంటే సభ నుంచి సస్పెండ్‌ చేయాలి. మీ అంతు చూస్తానని చేయి చూపించి మాట్లాడటం దారుణం. 

Read Also: పేద పిల్ల‌లు ఉన్న‌త స్థాయిలో ఉండాల‌నే ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెట్టాం

తాజా ఫోటోలు

Back to Top