పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనే ఉద్దేశ్యంతోనే గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. ఇంగ్లిష్ మీడియం మేం ప్రవేశపెట్టాలనుకుంటే ఆరోజు ప్రతిపక్షం అడ్డుపడిందని చంద్రబాబు మాపై నిందలు వేయడం మానుకోవాలి. ఆయన అసమర్థతను మాపై రుద్దం సరికాదు. ఆయన కేబినెట్‌లో ఉన్న మంత్రికి సంబంధించిన స్కూళ్లు కాలేజీలకు లబ్ధి చేకూర్చాలనుకున్నాడే తప్ప నిస్వార్థంగా ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలని మంచి ప్రయత్నం జరగలేదు. పైగా రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లను మూసేసిన ఘనత చంద్రబాబుది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై ప్రజల నుంచి వస్తున్నస్పందనతో చంద్రబాబు వెనక్కి తగ్గి గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్, తెలుగు మీడియం రెండూ ఉండాలని చెబుతున్నాడు. పేద ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఆయనలో లేదు. 35 శాతం గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, 65 శాతం తెలుగు మీడియం ఉన్నాయి. 94 శాతం ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం నడుస్తోంది. సర్కారు బడులు కూడా ప్రైవేటు స్కూళ్లతో సోటీ సడాలంటే ఇంగ్లిష్ మీడియం రావాలి. Read Also: ఇదేనా చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం