ఇదేనా చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం

స్పీకర్‌ను మర్యాదగా ఉండదని అంటారా?
 

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
అసెంబ్లీ: నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు సభా మర్యాదలు తెలియవని, స్పీకర్‌పై అమర్యాదగా మాట్లాడటం ఏంటని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.  స్పీకర్‌ స్థానాన్ని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అగౌరవ పరిచారని, స్పీకర్‌ను పట్టుకొని మర్యాద ఉండదని అంటారా అని నిలదీశారు. స్పీకర్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు.  చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉన్నా..14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తికి సభా మర్యాదలు తెలియవా? ఆయనపై చర్యలు తీసుకోవాలి. స్పీకర్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి.

Read Also: భూములిచ్చిన రైతుల పిల్లలకు స్థానికంగా ఉద్యోగాలు

తాజా ఫోటోలు

Back to Top