బోండా, బుద్ధాలకు మాచర్లలో పని ఏంటీ..?

ఎన్నికల కోడ్‌ ఉంటే 10 వాహనాలకు పర్మిషన్‌ ఎవరిచ్చారు

ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది

ఎమ్మెల్యే ముస్తఫా, అంబటి రాంబాబుపై బాబు దాడి చేయించలేదా..?

ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేయించిన ఘనత టీడీపీది

నాయకులంతా టీడీపీని వీడుతుంటే బాబుకు నిద్రపట్టడం లేదు

సీఎం వైయస్‌ జగన్‌ సంస్కరణలు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

 

తాడేపల్లి: బోండా ఉమా, బుద్ధా వెంకన్నలకు మాచర్లలో పనేంటీ..? ఎన్నికల కోడ్‌ ఉంటే పది వాహనాల్లో ర్యాలీ చేస్తారా..? వాహనాలకు పర్మిషన్‌ ఉందా..? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు.  ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి విజయవాడ నుంచి గుండాలను తీసుకెళ్లి రౌడీయిజం చేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు.. తెలుగుదేశం పార్టీని నాయకులంతా వీడిపోతున్నారని జీర్ణించుకోలేక ఇలాంటి దుశ్చర్యలకు ఉసిగోల్పుతున్నాడని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపాలని సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడమే కాకుండా.. ఎమ్మెల్యేలు, మంత్రుల బంధువులు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశానికి ఏపీ రోల్‌మోడల్‌గా ఉండాలని గొప్ప సంస్కరణలు తెస్తే.. వీటిని చూసి తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు పచ్చపత్రికల్లో రాయిస్తున్నాడు.

డబ్బు, మద్యం లేకుండా నిజాయితీ పరులు, మేధావులు ఎన్నికల్లో పాల్గొనాలని, స్థానికంగా ఉండే వారికే అవకాశం ఇవ్వాలనేది సీఎం నిర్ణయం. సీఎం వైయస్‌ జగన్‌ తెచ్చిన సంస్కరణల వల్ల ప్రజల్లో ఉండేవారు, పేదలు కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఈ నిర్ణయాలను అన్ని రాష్ట్రాలు అభినందిస్తుంటే.. ఎల్లోమీడియా మాత్రం ఏదో జరిగిపోతున్నట్లుగా చిత్రీకరిస్తుంది. సీఎం వైయస్‌ జగన్‌ గత ఎనిమిది నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. చంద్రబాబు, ఎల్లోమీడియాకు ఒక్కటి కూడా నచ్చడం లేదు.

ఇంగ్లిష్‌ మీడియాన్ని కేసీఆర్‌ అభినందించి తెలంగాణలో కూడా ఏర్పాటుకు కృషిచేస్తున్నారు. మూడు రాజధానులు, అమ్మ ఒడి, దిశ చట్టం, ఎన్నికల సంస్కరణలు తీసుకువచ్చారు. 40 ఏళ్ల అనుభవం ఉన్నా.. తన మదిలో పుట్టని సంస్కరణలు సీఎం తీసుకొస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. ఎల్లోమీడియా సీఎం నిర్ణయాన్ని ఎప్పుడైనా సమర్థించాయా..?  

గత టీడీపీ హయాంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలంలో మా పార్టీ తరుఫున గెలిచిన ఎంపీటీసీలను ఎంపీపీ ఎలక్షన్‌ కోసం తీసుకెళ్తుంటే.. బందిపోటు దొంగల ముఠాలా.. మేడికొండూరు వద్ద దాడి చేసి బస్సులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా, అంబటి రాంబాబుపై దాడి చేసి ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఆ రోజున చంద్రబాబు నీతి, నిజాయితీ ఏమైంది. గత ఐదేళ్లలో మాచర్లలో ఏమేమి జరిగాయో చంద్రబాబుకు తెలియదా..? కోడెల శివప్రసాద్, కోడెల తనయుడు చేసిన అరాచకాలు నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల ప్రజలకు తెలుసు. గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో చేసిన దౌర్జన్యాలు అన్నీఇన్నీ కావు.

టీడీపీ నుంచి నాయకులంతా వెళ్లిపోతుంటే చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు. కదిరి బాబూరావు, పులివెందుల సతీష్‌రెడ్డి పార్టీని వీడితే జీర్ణించుకోలేక కుట్రలు చేయడం అమానుషం. నీతిగా పరిపాలించి ఉంటే.. సీబీఐని, ఈడీ రాష్ట్రంలోకి ఎందుకు రానివ్వలేదు. శాంతియుతంగా ఎన్నికలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుంది. మద్యం షాపులు 15  రోజుల పాటు బంద్‌ చేయిస్తున్నాం. డబ్బులు లేకుండా ఎన్నికలు జరగాలని ధృడ నిశ్చయంతో ఉన్నాం.

పులివెందుల పంచాయితీ అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. పులివెందులకు వెళ్తే అక్కడ ప్రజలు చూపించే ప్రేమ అనురాగాలు, పలకరింపులు, మాట ఇచ్చి మాట మీద నిలబడే తీరు చూస్తే చంద్రబాబు జీవితంలో అలాంటి ప్రవర్తన రాదు. నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితిలో టీడీపీ ఉంది.  ఎన్నికల దృష్టిని పక్కకు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
 

తాజా వీడియోలు

Back to Top