వైయస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరిందే వైయస్‌ జగన్ 

ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి 

 వైయస్ వివేకా హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలి

వాస్తవాలను వక్రీకరిస్తూ ఎల్లో మీడియాలో రాతలు

ఎన్నికల్లో గెలవలేక చంద్రబాబు కుట్ర రాజకీయం 

వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడానికి చంద్రబాబే కుట్రలు చేశారు

సీబీఐని రాష్ట్రంలోకి రానిచ్చేది లేదని నో ఎంట్రీ బోర్డు పెట్టింది చంద్రబాబే

వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా గెలపించటానికి శ్రీ వైయస్ జగన్ అన్ని ప్రయత్నాలూ చేశారు

ఇవాళ మీడియా హెడ్‌లైన్స్‌లో దస్తగిరి స్టేట్ మెంట్ గా  కాకుండా సీబీఐ చెప్పినట్లు ఆ రాతలు ఏమిటి?

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఎల్లో మీడియా అబద్దాలు ప్రచారం చేస్తోంది

ఎల్లో మీడియా అసత్య కథనాలు ఆధారంగా టీడీపీ విమర్శలా?

టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదనే భయంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయం

సీఎం శ్రీ వైయస్ జగన్ సంక్షేమ కార్యక్రమాల వల్ల మైలేజీ వస్తుందని ప్రతిరోజూ చంద్రబాబు విమర్శలు

వివేకానంద రెడ్డి హత్య కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిగి నిజాలు బయటకు రావాలి

వివేకా హత్య వెనుకున్న నిజాలు వెలుగులోకి వచ్చిప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది

దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైయస్ అవినాష్‌ ఆలోచిస్తున్నారు

హైద‌రాబాద్‌:  వైయస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరిందే వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి అని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.వివేకానంద హత్య కారకులకు కఠిన శిక్ష పడాలని వైయస్‌ఆర్‌సీపీ కోరుకుంటోంద‌న్నారు. రాష్ట్రంలో ఏ సంఘటననైనా, కుటుంబ ఘటననైనా, దేవాలయాలైనా, ఇలా ఏదైనా రాజకీయాలతో ప్రతిపక్ష పార్టీ ముడిపెడుతోందని  మండిపడ్డారు. రాష్ట్రాన్ని, ప్రజలను వదిలేసి.. ఏవిధంగా శ్రీ వైయ‌స్‌ జగన్ విలువ తగ్గించాలనే ప్రయత్నం ప్రతిపక్షం, ఎల్లో మీడియా చేస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఎంతసేపూ శ్రీ జగన్ గారే టార్గెట్ అన్నట్లుగా టీడీపీ, దానికి వత్తాసు పలికే మీడియా వ్యవహరిస్తు0దన్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్న రీతిలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆదివారం హైద‌రాబాద్‌లో గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వివేకానంద హత్యపై సీబీఐ విచారణ కోరిందే శ్రీ వైయ‌స్‌ జగన్
ఈరోజు వైయస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి కొన్ని పత్రికల్లో వార్తలు రాశారు. వివేకానందరెడ్డి గారు మరణించినప్పుడు ఆకేసును సీబీఐకి అప్పగించాలని శ్రీ జగన్ గారు డిమాండ్ చేశారని గడికోట గుర్తు చేశారు. ఆనాడు ఈనాడు దినపత్రికలో వచ్చిన పత్రికా కథనాన్ని గడికోట చూపించారు. గతంలో చంద్రబాబు పాలనలో ఏనాడూ సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించలేదు. పైగా రాష్ట్రానికి సీబీఐ వస్తే తోక కత్తిరిస్తా.. రాష్ట్రం నుంచి తరిమేస్తా.. మీరెవరు రావటానికి అని చంద్రబాబు మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య విషయంలో పొరుగు రాష్ట్రం కర్ణాటక అంశం కూడా ఉంది. కాబట్టి కుటుంబ సభ్యుల కోరిక మేరకు సీబీఐ చేస్తే బావుంటుందని శ్రీ జగన్ అంగీకరించారు. శ్రీ జగన్ గారు సీబీఐ ఎంక్వైరీకి అంగీకరించకపోయినట్లైతే దర్యాప్తు జరిగి ఉండేది కాదు. వాస్తవాలు బయటకు రావాలని ముందుచూపుతో సీబీఐ ఎంక్వైరీని శ్రీ జగన్‌ గారు కోరారని గడికోట తెలిపారు. 

వివేకా హత్య కేసును రాజకీయాలతో టీడీపీ ముడిపెట్టడం ఏంటి?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించటానికి ఎంపీటీసీలను ప్రత్యేక విమానాల్లో పాండిచ్చేరికి తరలించిన బాబు
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ సంఘటన (వివేకానంద రెడ్డి గారి హత్య) జరిగింది. టీడీపీ ఏమి చేయకపోగా బురద చల్లే కార్యక్రమం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత  జగన్ గారిపైన బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగు రాష్ట్రంకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని సీబీఐని ఎంక్వైరీ చేయమని శ్రీ జగన్ కోరారు. వివేకానంద రెడ్డి గారు శ్రీ వైయస్‌ జగన్ గారికి సొంత బాబాయి మాత్రమే కాకుండా జిల్లాల్లో ఎంతో విలువలున్న వ్యక్తి. వివేకాను శ్రీ జగన్ గారు ఎంతగానో గౌరవిస్తారు. కొన్ని కారణాలతో వివేకా పార్టీని విడిచినా మళ్లీ పార్టీలోకి వచ్చి అన్నీ తానై పార్టీని చూసుకున్నారు. అందరికీ వివేకా ఎంతో గౌరవప్రదనీయుడు. వివేకానంద రెడ్డి మీదున్న గౌరవంతో స్థానిక సంస్థల్లో పార్టీకి బలం ఉందని ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన్ను నిలబెట్టడం జరిగింది. ఆరోజున వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే శ్రీ జగన్ బలం పెరుగుతుందని చంద్రబాబు చేయని కుట్రలు లేవు. ప్రత్యేక విమానాలు కడప ఎయిర్‌పోర్టులో పెట్టి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను పాండిచ్చేరి క్యాంప్‌కు తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన దౌర్భాగ్య రాజకీయాలు ఇప్పటికీ జిల్లా ప్రజలు మర్చిపోరని గండికోట గుర్తు చేశారు. ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రత్యేక విమానాల్లో ఎంపీటీసీలను తరలించే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. అంత నీచానికి ఒడిగట్టి వివేకానంద రెడ్డిని చంద్రబాబు ఓడించారు. వివేకానందరెడ్డి గెలుపు కోసం శ్రీ జగన్ ఎంత ప్రయత్నం చేశారో అందరికీ తెల్సు. వివేకాను ఎంతగానో శ్రీ జగన్ గారు గౌరవించారు. అంతేకానీ ఎవరైనా ఆయనకు అలా చేయాలని ఆలోచన చేస్తారా అని గడికోట అన్నారు.

మొదట్నుంచీ శ్రీ జగన్ గారిపై ఎల్లో మీడియా అసత్య కథనాలు
నాడు వైయస్‌ఆర్‌ మృతి నుంచి వివేకా వరకు శ్రీ వైయ‌స్ జగన్ గారిపై బురదజల్లాలని చూశారు
కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసి, లేనిది ఉందని సృష్టించాలని చెప్పి శ్రీ జగన్ చేయి చేసుకున్నారని అనేక అసత్య కథనాలు ప్రచురించారు. ఎప్పుడూ దుర్గార్మమైన వ్యవహారం. వైయస్‌ఆర్ మృతి చెందిన తర్వాత ఎంతో దుఃఖంలో ఉన్నారని ఆలోచన చేయకుండా ఆయన పార్థివదేహం వద్ద ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారని  తప్పుడు ప్రచారం చేశారు. రాజకీయంగా ఎదగాలంటే ప్రజల్నో మన్ననలు పొందాలనే ఆలోచన చేయాలి. ఇంత దిగజారుడుతనం రాజకీయాలు చంద్రబాబుకు అవసరమా అని గడికోట ప్రశ్నించారు. ఆనాడు తండ్రి చనిపోయినప్పుడు, బాబాయి చనిపోయినప్పుడు అదేరకమైన కుట్రలు ఎల్లో మీడియాలో ప్రచురించారు. తాటికాయ0త అక్షరాలతో వైయస్ అవినాష్‌ రెడ్డిని ఇందులో చూపించాలని ఈనాడులో రాశారు. "కుట్రదారులు వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర రెడ్డి, వైయస్‌ మనోహర రెడ్డి, శంకరెడ్డి అని" పెద్ద అక్షరాలతో వేసి కింద వివేకానంద రెడ్డి డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం అని చిన్న అక్షరాలతో రాశారు. ఇది నైతికతేనా? ఎందుకు ఇలాగా.. మీ కుట్రలు ఇలా చూపిస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో అయితే ఏకంగా పెద్దల హత్య అని ఫొటోలతో వేసి దస్తగిరికి గంగిరెడ్డి చెప్పారని రాశారు. 

దస్తగిరి వాంగ్మూలం ఇస్తే అదేదో సీబీఐ చెప్పినట్లు ఎల్లో మీడియా ప్రచారమా?
వాస్తవాలు ఏంటి అంటే.. గంగిరెడ్డి అనే వ్యక్తి దస్తగిరికి చెప్పాడంట. దస్తగిరి చంపాడంట. దస్తగిరి చంపినట్లు అంగీకరించాడట. ఆ విషయాన్ని వారు చెప్పినట్లు కాకుండా ఏదో సీబీఐ చెప్పినట్లు రాశారు. మనం నిజంగా మాట్లాడుకుంటే.. సంబంధం లేని వ్యక్తి అవతల వారిని ఇరికించాలంటే ఎవరి పేరైనా చెప్పొచ్చు. అవసరమనుకుంటే సీఎం పేరు, పీఎం పేరు కూడా చెప్పొచ్చు. దాన్ని పూర్తిగా డీటైయిల్డ్‌గా ఎంక్వైరీ లేకుండా.. వాంగ్మూలమనే మాట లేకుండా ఫలానా వారితో జరిగిందనే రీతిలో ప్రచురింప చేయటం కరెక్టా? ఇది నైతికతేనా? పైగా దీన్ని పట్టుకొని టీడీపీ, మీడియా సమావేశాలు పెట్టడం ఏంటి?

రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. రాజకీయ భవిష్యత్తు లేదనే నీచ రాజకీయాలు
నిజానికి చంద్రబాబు రాజకీయపరంగా ఆంధ్రరాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఉంది. చంద్రబాబుకు, లోకేశ్‌కు రాజకీయ భవిష్యత్తు లేదనే భయంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఎక్కడా పోటీ చేయరు. పోటీ చేసిన చోట గెలవమని ముందే నిర్ణయించుకొని,  బురద చల్లుడు కార్యక్రమం చేపట్టి పోలీసులు, ఇతర అధికారులపై నిందలు వేస్తున్నారు. ఆంధ్రాలో చంద్రబాబును పూర్తిగా ప్రజలు మర్చిపోతున్నారు. టీడీపీకి మనుగడ లేదనే భయాందోళనతో చంద్రబాబు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన ఏ అంశంపైనా చంద్రబాబు మాట్లాడటం లేదు. ఉనికి కోసం శ్రీ జగన్ గారిపై చంద్రబాబు బురద జల్లుతున్నారు. ఇలా చంద్రబాబు దిగజారటం ఎంతవరకు సమంజసమని గడికోట ప్రశ్నించారు. 

వివేకానంద రెడ్డి మరణంపై నిజాలు బయటకు రావాలి
తూతూమంత్రంగా ఆయన అన్నారు.. ఈయన విన్నారు.. కాకుండా ఆధారాలతో సహా వచ్చినప్పడే స్వాగతిస్తాం
పార్టీలో వైయస్‌ వివేకానంద రెడ్డి గారితో ఉన్న గౌరవంతో ఆయన మరణం వెనుక పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాం. ఎవరు చెప్పారన్నది కాదు.. ఎవరెవరు దీనివెనుక ఉన్నారు. ఎవరి పాత్ర ఉంది. దీనివెనుక ఉన్న పెద్దలు ఎవరో... ఎవరు చేయిస్తున్నారో వాస్తవాలు బయటకు వస్తే మాలాంటి వారం సంతోషపడతామన్నారు. అప్పుడే వివేకానందరెడ్డి ఆత్మ సంతోషిస్తుంది. అలా కాకుండా ఏదో తూతూ మంత్రంగా ఆయన చెప్పారు.. ఈయన విన్నారు.. కాకుండా ఆధారాలతో సహా అన్నీ వచ్చినప్పుడు మేం స్వాగతిస్తాం. 100% విచారణ నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 

దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైయస్ అవినాష్‌ ఆలోచిస్తున్నారు
నిజాలు బయటకు రావాలని కోరుకుంటుంటే.. అసత్యాలతో దుష్పప్రచారం చేస్తున్నటువంటి ఎల్లో మీడియా మీద, తెలియకుండా నిందలు వేస్తున్న వారిపై వైయస్‌ అవినాష్‌ రెడ్డి చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి ఆలోచనలు చేస్తున్నారు. చాలా దుర్మార్గం. ఒక కుటుంబ సభ్యుడిని పోగొట్టుకొని వారు దుఃఖంలో ఉంటే పొలిటికల్‌గా వేరే పార్టీకి మైలేజీ తేవాలని ఇంకొకరి విలువ తగ్గించాలని ఈ రకమైన హెడ్‌లైన్స్‌ ప్రచురించినందుకు ఎల్లో మీడియా సిగ్గుపడాలి. సీబీఐ చెప్పలేదు. దస్తగిరి అనే వ్యక్తికి గంగిరెడ్డి అనే వ్యక్తి చెబితే ఏదో జరిగిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దస్తగిరికి గంగిరెడ్డి అలా ఎందుకు చెప్పాడో... గంగిరెడ్డి ద్వారా వాస్తవాలు బయటకు రావాలి. ఆధారాలు బయటపెట్టాలి. కేవలం రాజకీయ పబ్బం కోసం చేయటం చాలా దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ నైతికతో ఆలోచన చేయాలి. టీడీపీ ఎలా డిమాండ్లు చేస్తోందో సమీక్షించుకోవాలి. రాజకీయంగా విలువలు పెంచుకోవాలి కానీ దిగజారేతనంతో టీడీపీ వ్యవహరిస్తోంది. టీడీపీని కాపాడుకోలేక పార్టీ పతనావ్యవస్థకు వచ్చిందనే దిగులుతో, భయాందోళనతో ఎంతసేపూ శ్రీ జగన్ గారిని టార్గెట్ చేస్తున్నారు. 

వివేకా మృతికి కారకుల్ని కఠినంగా శిక్షించాలి
వైయస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు కూడా సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేశాం. ఇప్పుడు కూడా పూర్తి సమాచారం, ఆధారాలు బయటకు రావాలని ఎవరైతే తప్పు చేశారో వారికి కఠిన శిక్ష అమలు చేయాలి. ఇది చాలా దుర్మార్గం. కేసును తప్పుదోవ పట్టించే విధంగా మసిపూసి మారేడు కాయ చేసి ఎవరిపైన నెట్టాలనే ప్రయత్నం సమంజసం కాదు. ప్రతిపక్షపార్టీలు పూర్తి రిపోర్టు చదవండి. ఇంగ్లీషులో కాకపోతే తెలుగులో కూడా ఉంటుంది. ఆ రిపోర్టు కూడా పంపిస్తాం. పత్రికల వారు, ప్రతిపక్షం చదవాలి. ఉన్నది ఉన్నట్లు రాస్తే బావుంటుంది. దుర్మార్గపు ఆలోచనలతో దిగజారకండని కోరుకుంటున్నానని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top