మాట తప్పిన నాయకులను నిలదీద్దాం..!

మాజీ డిప్యూటీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు

పాతపట్నంలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ క్యూ ఆర్‌ కోడ్‌ పోస్టర్ ఆవిష్క‌ర‌ణ‌

శ్రీ‌కాకుళం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పిన కూటమి నాయకులను నిలదీద్దామని మాజీ డిప్యూటీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్  పిలుపునిచ్చారు. జిల్లాలోని పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ విస్తృతస్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు. ఇందులో భాగంగా బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ క్యూ ఆర్‌ కోడ్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్, వైయ‌స్ఆర్‌సీపీ వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, దుంపల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top